Moviesమెగా ఫ్యామిలీలో అల్లుళ్లు డ‌మ్మీలుగా ఉంటేనే మెగా కూతుళ్లు కాపురాలు చేస్తారా…?

మెగా ఫ్యామిలీలో అల్లుళ్లు డ‌మ్మీలుగా ఉంటేనే మెగా కూతుళ్లు కాపురాలు చేస్తారా…?

ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీ వర్గాల్లో బాగా చర్చికి వస్తోంది. మెగా ఫ్యామిలీలో మెగా ఆడపడుచుల కాపురాలు ఎందుకు ? నిలబడటం లేదు ఎక్కడ తేడా కొడుతుంది.. ఒకటి కాదు రెండు కాదు మెగా బ్రదర్స్ ముగ్గురు కుమార్తెల జీవితాలు అంత సవ్యంగా ఎందుకు ? ఉండటం లేదన్న ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో రకరకాల ఆన్సర్లకు కారణమవుతున్నాయి. ముందుగా చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితకు అప్పట్లో క్రేజీ హీరోగా ఉన్న దివంగత హీరో ఉదయ్ కిరణ్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. కారణాలు ఏమైనా పెళ్లి వరకు వెళ్లకుండానే వీరి వివాహం క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత చెన్నైకి చెందిన పారిశ్రామిక వేత్తల కుటుంబానికి చెందిన అబ్బాయితో సుస్మిత పెళ్లి జరిగింది.

ఐదారేళ్లపాటు చెన్నైలో ఉన్న సుస్మిత తిరిగి హైదరాబాద్ కు వచ్చేసింది. ఆమె చిరంజీవి ఇంట్లోనే గత పదేళ్ళుగా ఉంటుంది. సుస్మితకు భర్తతో అంత సఖ్యత లేదన్న ప్రచారం కూడా బాగా నడిచింది. ఇప్పుడు అత్తారిల్లు వదిలేసి పుట్టింట్లోనే ఉంటూ సినిమాలు, వెబ్ సిరీస్ అంటూ కాలం గడుపుతున్న పరిస్థితి. చిరంజీవి కూడా తన కుమార్తెను నిర్మాతగా నిలబెట్టేందుకు చాలా కష్టపడుతున్నారు. అసలు సుస్మిత భర్తతో ఏనాడు బయట కనిపించలేదు. ఇక చిరు రెండో కుమార్తె శ్రీజ ముందుగా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఒక పాప పుట్టాక మనస్పర్ధలు.. విడాకులు తర్వాత ఇంట్లో పెద్దలు ఒప్పించ‌డంతో చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకుంది.

మళ్ళీ ఒక పాప పుట్టాక మనస్పర్ధలు.. దాదాపు ఏడాదికాలంగా శ్రీజ‌ తన భర్తకు దూరంగా ఉంటూ వస్తుంది. వీరిద్దరు కూడా త్వరలో విడిపోతున్నారంటూ దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక విషయంలోనూ అలాగే జరగబోతుందా ? అంటే ఇండస్ట్రీ వర్గాలు అవుననే అంటున్నాయి. నిహారికకు.. తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు బాగా గ్యాప్ వచ్చేసిందని అందుకే చివరకు సోషల్ మీడియా ఖాతాలలో కూడా వీరిద్దరూ ఒకరి ఫోటోలను మరొకరు డిలీట్ చేసుకున్నారని.. వీరిద్దరూ కలిసి ఉండటం దాదాపు అసాధ్యం అని అంటున్నారు. ఎందుకు ? మెగా కుటుంబంలో ఆడపడుచులకే ఇలా జరుగుతుందన్న ప్రశ్నకు రకరకాల ఆన్సర్లు కూడా వినిపిస్తున్నాయి.

మెగా ఫ్యామిలీలో అమ్మాయిలు చేసుకున్న భర్తలకు అంతగా విలువ ఉండదని.. కేవలం తాము మెగా ఫ్యామిలీ వారసురాళ్ళం అన్న ధీమా వాళ్ళలో బలంగా నాటుకుపోయిందని.. వారు ఏం చెప్పినా.. చేసినా భర్త వినటం చూస్తూ ఉండటం తప్ప ప్రశ్నించకూడదని… ఆ ధోర‌ణితోనే ఆ ఫ్యామిలీ అమ్మాయిలు ఉంటున్నారని టాక్ అయితే బలంగా వచ్చేసింది. ఇక మెగా ఇంటికి అల్లుడుగా వెళ్ళిన వారి ఇష్ట ఇష్టాలతో మెగా ఆడపడుచులకు ఏమాత్రం సంబంధం లేకుండా వ్యవహరిస్తారని.. దీంతో అల్లుళ్ల ఆత్మాభిమానం దెబ్బతినడంతోనే మెగా అల్లుళ్ళు సైతం ఫ్రస్టేషన్ తట్టుకోలేక చూసి ఏదో ఒక రోజు బ‌ర‌స్ట్ అవుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

ఇక తల్లిదండ్రులు సర్ది చెబుతున్న కూడా మెగా ఆడపడుచులు వినే పరిస్థితి నుంచి దాటిపోయారని.. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా చూసుకోవటం.. ఈ అతిగారాబం వల్లే వీళ్ళు మంకు పట్టుకుపోయి చివరకు భర్తలను సైతం పూర్తిగా డామినేషన్ చేసే పరిస్థితి వచ్చేసిందట‌. అందుకే మెగా ఆడపడుచులు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సి ఉన్నా… వెళ్లకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని అందుకే వారి వైవాహిక జీవితాలు అంత సవ్యంగా ముందుకు సాగటం లేదని ఇండస్ట్రీలోనే టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా తమ ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ దృష్ట్యా మెగా ఆడపడుచులు ఒక మెట్టు వెనక్కి తగ్గి భర్త, కుటుంబ, వైవాహిక జీవితానికి విలువ ఇస్తే వారి జీవితాలు సవ్యంగా కొనసాగుతాయని చాలామంది పలు సూచనలు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news