Moviesనంద‌మూరి ఫ్యాన్స్‌కు పూన‌కాలు… బాల‌య్య అఖండ 2 ఓపెనింగ్ డేట్ వ‌చ్చేసింది..

నంద‌మూరి ఫ్యాన్స్‌కు పూన‌కాలు… బాల‌య్య అఖండ 2 ఓపెనింగ్ డేట్ వ‌చ్చేసింది..

నందమూరి ఫ్యాన్స్ కు మళ్ళీ పునకాలు మొదలు కాబోతున్నాయి. వరుస ప్లాపుల‌తో ఉన్న బాలయ్య అఖండ సినిమాతో థియేటర్లలో కేవలం నందమూరి అభిమానులకు మాత్రమే కాకుండా.. తెలుగు ప్రేక్షకులు అందరికీ అఖండ గర్జన మోగిస్తూ థియేటర్లలో పూనకాల మోత మోగించేశారు. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నిజంగా కరోనా గట్టిగా ఉన్నప్పుడు అఖండ థియేటర్లలోకి వచ్చింది. అప్పుడు టికెట్ రేట్లు కూడా ఏపీలో చాలా తక్కువగా ఉన్నాయి.

కరోనా లేకుండా ఉండడంతో పాటు టికెట్ రేట్లు మామూలుగా ఉండి ఉంటే అఖండ ఎన్నో సంచలన రికార్డులు.. కమర్షియల్ గా మరిన్ని భారీ లాభాలు తెచ్చిపెట్టి ఉండేది. అలాంటి టైంలో కూడా అఖండ సాధించిన అఖండ విజయం చూసిన తెలుగు సినిమా వర్గాలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు అఖండ తర్వాత బాలయ్య క్రేజ్ మామూలుగా లేదు. ఆ ఉత్సాహంతోనే వీర సింహారెడ్డి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది.

అఖండ సినిమాలో శివుడు, శివ భక్తితో పాటు బాలయ్య నట విశ్వరూపాన్ని చూసిన ప్రతి ఒక్క తెలుగు సినిమా అభిమాని అఘోరా పాత్రలో బాలయ్య తప్ప మరో నటుడిని ఎప్పటికీ ఊహించుకోలేమని ప్రశంసలు జల్లు కురిపించేశారు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సింహా, లెజెండ్ తర్వాత అఖండ హ్యాట్రిక్ హిట్ సినిమాగా నిలిచింది. అఖండ హిట్ తర్వాత దర్శకుడు బోయపాటి కచ్చితంగా అఖండ 2 ఉంటుందని చెప్పారు. అలాగే బాలయ్య కూడా అఖండ 2 సినిమా చేస్తామని ప్రకటించారు.

ఇక తాజా సమాచారం ప్రకారం నందమూరి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు పురస్కరించుకుని అఖండ 2 సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నారు. దీనిపై ఏప్రిల్ మొదటి వారంలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. అఖండ సినిమాలోలా అఖండ 2 లో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. బాలయ్య రెండు పాత్రలోనూ చాలా చాలా వేరియేషన్లు ఉన్నాయని తెలుస్తోంది.

బోయపాటి టీం ఇప్పటికే కథ చర్చలు.. రచనల్లో మునిగి తేలుతోంది. ప్రస్తుతం బోయపాటి, రామ్ తో తెరకెక్కిస్తున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ కు కంప్లీట్ అవుతుంది. ఆ వెంటనే అఖండ 2 సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు సరిపోయేలా సరికొత్త స్టోరీ తో బోయపాటి ఈ కథను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అఖండ 2 ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి బోయపాటి – బాలయ్య ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news