టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ..ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా శాకుంతలం. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో శకుంతల దేవి పాత్రలో కనిపించబోతున్న సమంత సినిమాకి తనదైన స్టైల్ లో ప్రమోషన్స్ చేస్తూ కొత్త హైప్ ని తీసుకొస్తుంది .
కాగా ఏమాత్రం తన హెల్త్ ని కేర్ చేయకుండా వరుసగా పలు ఛాఅనల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న సమంత .. రీసెంట్ ఇంటర్వ్యూలో తన పర్సనల్ అండ్ పబ్లిక్ లైఫ్ గురించి ఓపెన్ అప్ అయింది . అంతేకాదు విడాకుల విషయంలో తన తప్పు ఏమీ లేదు అంటూ తేల్చి చెప్పేసిన సమంత.. తను ఎందుకు కళ్లద్దాలు పెట్టుకుంటానో కూడా క్లారిటీ ఇచ్చింది .
ఈ క్రమంలోనే హోస్ట్ అడిగిన ప్రశ్నకు సమంత సమాధానం ఇస్తూ..” నా ఆరోగ్య సమస్య కారణంగానే నేను కళ్లద్దాలను ధరిస్తున్నాను ..ఎందుకో తెలియదు.. కొంతకాలంగా నా కళ్ళు లైట్స్ బ్లింక్ అవుతుంటే తట్టుకోలేకపోతున్నాయి . కళ్ళల్లో మంట.. తెలియకుండానే నీరు వచ్చేస్తుంది . ఈ క్రమంలోనే సేఫ్టీ పర్పస్ కింద కళ్లద్దాలను ధరిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలోనే సమంత ఆరోగ్యం ఇంతలా పాడైపోయిందా ..? మయోసైటిస్ తో ఓసారి అభిమానులను టెన్షన్ పడితే .. మరోసారి ఇలా కళ్ళకి కూడా ప్రాబ్లం ఉంది అంటూ చెప్పి షాక్ ఇచ్చావే సమంత అంటున్నారు ఫ్యాన్స్. అయితే విడాకులు తర్వాత సమంతకు ఇలాంటి రోగాలన్నీ వస్తున్నాయని .. విడాకులు ముందు వరకు సమంత ఫుల్ యాక్టివ్ గా ఉంది అంటూ సామ్ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు..!!