టాలీవుడ్ లో మన హీరోలు పైకి చేతులు కలుపుకుంటూ ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా.. లోపల మాత్రం వారి మధ్య భయంకరమైన ఈగోలు ఉంటాయన్నది వాస్తవం. ఉదాహరణకు సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురంలో సినిమాలు రిలీజ్ అయినప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇద్దరు పంతాలకు పోయారు. సినిమా రిలీజ్ డేట్ ల విషయంలో ఇద్దరు ఎవ్వరు వెనక్కు తగ్గలేదు. పోటా పోటీగా కలెక్షన్ల పోస్టర్లు వేసుకున్నారు. ఎంత లేదన్నా ఇప్పటికీ ఇద్దరు హీరోల మధ్య ఆ ఇగో కంటిన్యూ అవుతుంది అన్న గుసగుసలు ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇక అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య కూడా ఇదే తరహా పంతం ఈగో అన్నది నడుస్తోంది.
పైగా అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన హీరోలు. వీరిద్దరి మధ్య వృత్తిపరమైన పోటీ చివరకు రెండు కుటుంబాల మధ్య పంతంగా మారిపోయిందని కూడా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సహజంగానే ఇండస్ట్రీలో ఒక హీరో ఎదుగుతున్నాడు అంటే ఓర్వలేని వారు ఎంతోమంది ఉంటారు. తెరవెనక గోతులు తీస్తూనే ఉంటారు. నేచురల్ స్టార్ నాని ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నాడు. అయితే గత కొంతకాలంగా నాని సినిమాలు హిట్ అవుతున్నా కమర్షియల్ గా మాత్రం అనుకున్న రేంజ్ రావడం లేదు.
నాని గత రెండు సినిమాలు కథా బలంగా మంచి సినిమాలు. నటనాపరంగా నానికి వంక పెట్టలేని సినిమాలు. అయితే కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. నాని నటిస్తున్న గత నాలుగైదు సినిమాల విషయంలో ఓవర్గం హీరోలు ఫ్లాప్ అంటు బాగా హడావిడి చేస్తున్నారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా నాని స్టార్ హీరోగా ఎదుగుతూ ఉండటం.. టాలీవుడ్ లో ఒక కాంపౌండ్ కు చెందిన హీరోలకు నచ్చటం లేదని.. అందుకే వారు పక్కా ప్లానింగ్ తో నాని సినిమాలు రిలీజ్ రోజున ఫ్లాప్ అంటూ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారన్న గుసగుసలు గత మూడు, నాలుగు యేళ్ల నుంచి వినిపిస్తున్నాయి.
అసలు నాని సినిమా వస్తుందంటేనే చాలు వారం రోజుల ముందు నుంచే సినిమా ఏం ? లేదు అన్న లిక్ లు వచ్చేస్తున్నాయి. దసరా సినిమాకు కూడా ముందు సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అవుతుంది, అనుకున్నంత గొప్పగా రాలేదు… పైగా నానికి అంత బడ్జెట్ అవసరమా ? సినిమా హిట్ అయినా భారీ నష్టాలు తప్పవంటూ ఆ కాంపౌండ్ కు చెందిన హీరోల అభిమానులు, ఆ హీరోల పిఆర్ టీం గ్యాంగ్ భారీ ఎత్తున ప్రచారానికి తెరదీశారు. చివరకు అందరి నోళ్లు మూయించేలా దసరా సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు తొలి రోజు ఏపీ, తెలంగాణలోనే రూ. 25 కోట్ల గ్రాస్ వసుళ్ళు వచ్చాయి. అటు ఓవర్సీస్‌లో తొలిరోజు వన్ మిలియన్ డాలర్లకు కాస్త దగ్గరగా వెళ్లిపోయింది.
పైగా ఇప్పుడు పోటీ సినిమాలు కూడా లేవు. ఈ లెక్కను చూస్తే దసరా పది రోజులపాటు టాలీవుడ్ లో దుమ్ము దులిపేయనుంది. దీంతో గత కొన్ని ఏళ్లుగా నానిని టార్గెట్ చేస్తూ వస్తున్న ఆ నలుగురు హీరోలు కుళ్ళుకు చస్తున్నారన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీలో నిన్న ఉదయం నుంచి మొదలైపోయాయి. దసరాకు అంత సూపర్ హిట్ టాక్ రావడం ఆ హీరోలకు వాళ్ళ పీ ఆర్ టీంలకు ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. గత రెండు మూడేళ్లుగా నాని కాస్త డౌన్ అయినట్టు ఉండడంతో ఆ హీరోలు, వాళ్ళ అభిమానులు రెచ్చిపోయేవారు. అయితే ఇప్పుడు వాళ్లకు వరుసగా ప్లాపులు పడుతున్నాయి. అదే టైంలో నానికి దసరా రూపంలో ఏకంగా పాన్ ఇండియా హిట్ వచ్చి పడింది. ఇదే వాళ్లకు ఇప్పుడు కంటగింపుగా మారిందని తెలుస్తోంది.