Movies"లేచిన మొదలు పడుకునే వరకు ఎప్పుడు అదే మాట".. సమంతను అమల...

“లేచిన మొదలు పడుకునే వరకు ఎప్పుడు అదే మాట”.. సమంతను అమల అంతలా టార్చర్ చేసిందా..?

సమంత – నాగచైతన్య విడాకుల సంగతి ఏమోగానీ వీరిద్దరి విడాకులు అయిన రోజు నుంచే తెలుగు సోషల్ మీడియాలో వీరి చర్చ లేని రోజు అంటూ లేదు. ప్రతిరోజు, ప్రతి గంట నాగచైతన్య – సమంత విడాకుల గురించి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటుంది. వీరిద్దరి విడాకుల గురించి ఎన్ని కొత్త వార్తలు ?వచ్చినా ఇటు నెటిజన్లకు ఇంకా తెలుసుకునేందుకు ఆసక్తి, ఉత్సాహం ఉంటూనే ఉంటాయి. తాజాగా సమంత చేసిన కామెంట్లతో ఇప్పుడు నెటిజెన్లు, వెబ్‌జ‌ర్న‌లిస్టులు మరింత సరికొత్తగా వార్తలు రాసుకుపోతున్నారు. తాజాగా సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్లలో తన విడాకుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది.

తాను తప్పు చేయనప్పుడు ఇంట్లో ఎందుకు ? కూర్చోవాలని ప్రశ్నించింది. ఇక విడాకుల తర్వాత న‌న్ను కుటుంబ సభ్యులు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయవద్దని.. అసలు సినిమాలలోనే నటించవద్దని చెప్పారని తెలిపింది. సమంత, చైతుతో పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించింది. అయితే విడాకులు తర్వాత మొదటిసారిగా పుష్ప‌ సినిమాలో ఐటెం సాంగ్ చేయటానికి.. ఆ సాంగ్ లో విచ్చలవిడిగా అందాలు ఆరబోయటానికి ప్రధాన కారణం అక్కినేని ఫ్యామిలీపై ఆమె పెంచుకున్న విపరీతమైన కోపమే కారణం అని తెలుస్తోంది.

ఇక చైతు, సమంత విడాకుల వ్యవహారంలో చాలా వేళ్లు నాగార్జున భార్య అమల వైపే చూపిస్తున్నాయి.
అమల, సమంతకు పెట్టిన కండిషన్లకు తోడు చైతు అమల వైపే ఉండటం.. కొన్ని విషయాలలో అమలకు సపోర్ట్ చేయడం సమంతను ఎక్కడో బాగా హర్ట్ చేసిందని.. అందుకే సమంత మానసికంగా ఎంతో ఆవేదనకు గురై చైతుకు దూరమైందని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది. చైతుతో పెళ్లి అయ్యాక కొద్దిరోజుల పాటు సమంత, అమల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయట.

ఆ తర్వాత అమల క్రమక్రమంగా సమంతకు కండిషన్లు పెట్టడం.. కట్టుబాట్ల పేరుతో ఆమె చుట్టూ ఒక కంచి వేయడం.. మనం వేసుకునే దుస్తులతో పాటు ఇతర సాంప్రదాయ విషయంలో ఎలా ? ఉండాలో చెప్పటం.. ఇక సినిమాలలో బోల్డ్ పాత్రలో నటించకూడదంటూ చాలా కండిషన్లు పెట్టడం సమంతకు నచ్చలేదని అంటారు. దీనికి తోడు ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్లో సమంత చేసిన బోల్డ్‌ నటన అమలకు బాగా కోపం తెప్పించిందట. అప్పుడు అక్కినేని ఫ్యామిలీ మీటింగ్ పెట్టి అందరి ముందు సమంత పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింద‌న్న‌ విషయం కూడా బయటికి వచ్చింది. ఒక్కోసారి రోజంతా వీరి మ‌ధ్య ఇదే త‌ర‌హా గొడ‌వ‌లు న‌డిచేవ‌ని కూడా లీకులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

అమల పెట్టే టార్చర్ భరించలేకే సమంత – నాగచైతన్యతో వేరే కాపురం కూడా పెట్టిందని అంటారు. పైగా వీరిద్దరూ కలిసి మురళీమోహన్ అపార్ట్మెంట్ పైన ఉండే ఓ పెంట్ హౌస్ లో ఉండేవారు. వీరిద్దరి జంట ఎంతో అన్యోన్యంగా ఉండే వారిని మురళీమోహన్ కూడా ఒకటి రెండు సందర్భాల్లో ప్రస్తావించారు. వేరుకాపురం పెట్టాక కూడా నాగచైతన్యకు, సమంతకు కొన్ని గొడవలు రావడం.. చైతు కూడా కొన్ని విషయాలలో సమంతకు సపోర్ట్ చేయకపోవడంతో అవి తిరిగి పెద్దవి అయ్యి చివరకు విడాకులకు కారణమయ్యాయని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news