Moviesఒక్క దెబ్బతో అడ్రెస్ లేకుండా పోయిన సుధీర్..? ఆ అత్యాశే కొంప...

ఒక్క దెబ్బతో అడ్రెస్ లేకుండా పోయిన సుధీర్..? ఆ అత్యాశే కొంప ముంచిందా..?

అత్యాశకు పోతే ఉన్నది కూడా సంకనాకి పోతుంది అంటూ మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు.. బహుశా సుధీర్ విషయం విన్న తర్వాత అది నిజమే అనిపిస్తుంది అంటున్నారు పలువురు జనాలు . మనకు తెలిసిందే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ..ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ స్పెషల్ స్ధానాన్ని క్రియేట్ చేసుకున్న సుధీర్ జనాలకు సుడిగాలి సుధీర్ గా బాగా సుపరిచితుడు అయ్యాడు .

sudheer

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా తన రేంజ్ ని.. క్రేజ్ ను ..డబల్ కాదు ట్రిపుల్ చేసుకున్న సుధీర్ తద్వారా వచ్చిన అవకాశాలతో సినిమా ఇండస్ట్రీలో హీరోగా కూడా సినిమాలు చేశాడు. సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్లకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో క్రేజ్ తో దూసుకుపోతున్న సుధీర్.. అన్నం పెట్టిన షో ని అర్ధాంతరంగా వదిలేశాడు . ఈ క్రమంలోనే పలు చానల్స్ ఆఫర్ ఇవ్వడంతో డబ్బు ఎర గా చూపించి సుధీర్ ని అటువైపుగా లాక్కున్నారు అంటూ జనాలు కామెంట్స్ చేశారు,

అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సుధీర్ వెండితెర పైన బుల్లితెర పైన కనిపించడమే మానేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా కనిపించడం లేదు . ఈ క్రమంలోనే ఆయన కెరియర్ అయిపోయిందని ..అడ్రస్ లేకుండా పోయాడు అంటూ పలువురు ట్రోల్ చేస్తున్నారు. వచ్చిన అవకాశాలలో నచ్చిన అవకాశాలను చూస్ చేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేయకా.. డబ్బు కోసం జబర్దస్త్ షోనే వదిలేసి ఇలా అన్నం పెట్టిన షో ని అవమానించాడు అని.. ఆ

అత్యాసే సుధీర్ కొంప ముంచేసింది అని.. ప్రజెంట్ అవకాశాలు లేక ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేని పొజిషన్లో ఉన్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు . అయితే సుధీర్ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తని ఖండిస్తున్నారు..సుధీర్ వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడని .. ఫారిన్ కంట్రీస్ లో సినిమా షూటింగ్ చేస్తున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. దీని పై సుధీర్ నోరు విప్పితేనే నిజా నిజాలు బయటపడుతాయి అంటున్నారు కామన్ పీపుల్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news