MoviesBala Krishna మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ని ఆపుతుంది ఆయనేనా..? బాలయ్య...

Bala Krishna మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ని ఆపుతుంది ఆయనేనా..? బాలయ్య ఆ ఆశలు వదులుకోవాల్సిందేనా..?

సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలయ్యకు ఉన్న క్రేజ్ ..రేంజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న ..కుర్ర హీరోలు ఉన్న ..స్టార్ హీరోలు ఉన్న ..తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలకృష్ణ రీసెంట్గా వీరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . అంతేకాదు కుర్ర హీరోలు కూడా చేయని సాహసంతో డ్యూయల్ రోల్ లో నటించి ..మెప్పించి… నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించాడు.

కాగా ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇదిగో మోక్షజ్ఞ ఎంట్రీ ..రేపే .. మాపు అంటూ కాలాన్ని సాగదీస్తున్నారే తప్పిస్తే ఇంకా మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ లేదు . అయితే ఎందుకు బాలయ్య ..మోక్షజ్ఞ ఎంట్రీని లేట్ చేస్తున్నారు అన్న విషయాన్ని గురించి రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది . బాలకృష్ణ ఫ్యామిలీ కి సంబంధించిన జ్యోతిష్కుడు మోక్షజ్ఞ టైం బాగోలేదని ..2024 తర్వాతే మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీ లో కెరీర్ స్టార్ట్ చేస్తే ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అవుతాడని అంతవరకు.. ఇండస్ట్రీకి దూరంగా ఉంచమని సలహా ఇచ్చారట .

ఇప్పటివరకు ఆయన చెప్పినవి నందమూరి ఫ్యామిలీలో తూ చా తప్పకుండా జరిగాయని ఆ కారణంగానే బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ ను లేట్ చేస్తున్నారని తెలుస్తుంది . అంతేకాదు వసుంధర కూడా మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలని కోరుకుంటుందట . ఈ క్రమంలోని ఆయనకు ఆశ ఉన్నా కానీ కొడుకుని ఇండస్ట్రీకి దూరంగా పెడుతున్నాడు అంటూ తెలుస్తుంది . 2024 తర్వాత బోయపాటి డైరెక్షన్లో కానీ , పూరి జగన్నాధ్ డైరెక్షన్లో కానీ కచ్చితంగా మోక్షజ్ఞను తెరపైకి హీరోగా పరిచయం చేస్తాను అంటూ భీష్ముంచుకుని కూర్చున్నారట బాలకృష్ణ . చూడాలి మరి నందమూరి వారసుడి రాక ఎప్పుడు సెట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news