సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ .. సమంత పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సమంత ఆరు నెలలు చావు – బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడింది . బ్రతుకుతాదో లేదో అన్నంత టెన్షన్ పడిపోయారు ఫ్యాన్స్ . ఎట్టకేలకు సమంత సక్సెస్ఫుల్గా మయోసైటిస్ అనే వ్యాధి నుండి పూర్తిగా కోలుకుని నెక్స్ట్ సినిమా షెడ్యూల్ ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సమంత పేరు మరోసారి సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతుంది .
ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న జంటను సమంత విడగొట్టింది అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . వాళ్ళు ఎవరో కాదు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ గా పేరు సంపాదించుకున్న యంగ్ హీరో అడవి శేష్ – సుప్రియ. మల్టీ టాలెంటెడ్ సుప్రియ అడవిశేషుతో ప్రేమాయణం నడుపుతుంది అన్న వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి . వీళ్లు కలిసి గూడచారి సినిమా చేశారు . ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్ బలంగా మారింది . రీసెంట్గా అక్కినేని ఇంట్లో జరిగిన ఈవెంట్లోనూ అడవి శేష్ ,ఎరిసారు. ఈ త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు.
అయితే వీళ్ళ పెళ్ళి ఎప్పుడో జరగాల్సిందని సమంతనే వీళ్ళ పెళ్లిని ఆపిందన్న న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్యతో విడిపోక ముందు అక్కినేని మేనకోడలు సుప్రియ కు-సమంతకు అస్సలు పడేది కాదట . ఈ క్రమంలోని అడవి శేష్ ను సుప్రియను దూరం పెట్టడానికి ట్రై చేసిందట. అలా సమంత వీరిద్దరిని వీడ కొట్టిందని ..అందుకే వీళ్ళు ఇంకా విడిగానే ఉన్నారని.. వీళ్ళ ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టలేకపోతున్నారని.. వీళ్ళు మధ్య చిన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్ ఉన్నాయి అంటున్నారు జనాలు. అంతేకాదు ఆ పాపమే నాగచైతన్యతో సమంతను విడాకులు తీసుకుని స్థాయికి శాపంగా మారిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి . చూడాలి మరి సమంత ఇలాంటి వార్తల పై ఎలా స్పందిస్తుందో..? అయితే త్వరలోనే అడవి శేష్ – సుప్రియను పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ టాలీవుడ్ సినీ వర్గాలలో కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది..!!