టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా సరే ..జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ..రేంజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగతా వాళ్ళందరూ దిగదుడుపే అని చెప్పాలి . దానికి మెయిన్ రీజన్ తారక్ సింప్లిసిటీ.. అభిమానుల పట్ల చూయించే ప్రేమ. జనాలకి బాగా తెలుసు చిన్న సందర్భానికి నానా హంగామా చేస్తూ డప్పు కొట్టుకునే క్యారెక్టర్ ఎన్టీఆర్ ది కాదు అని. ఈ విషయం నందమూరి అభిమానులకు అందరికీ తెలిసిందే.
మరి ముఖ్యంగా ఆయనని హీరోగా కన్నా అన్నగా అభిమానిస్తారు నందమూరి ఫ్యాన్స్. ఎక్కడికి వెళ్ళినా సరే నందమూరి అభిమానుల సెక్యూరిటీ ఎక్కువగా ఆలోచించే ఎన్టీఆర్ తన చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకొని బాధపడిపోతున్నారట . ఈ న్యూస్ ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది . మనకు తెలిసిందే తారక్ అమ్మగారు షాలిని హరికృష్ణ రెండో భార్య .. ఆమెని నందమూరి ఫ్యామిలీ మొదట గా కోడలుగా యాక్సెప్ట్ చేయలేదు ..ఎన్టీఆర్ పుట్టిన తర్వాత కూడా కుటుంబానికి దూరంగానే పెట్టారు.
ఈ క్రమంలోని తన బాల్యాన్ని చాలా కష్టంగా గడిపాడు తారక్. అయితే ఎన్టీఆర్ కి స్టార్ డమ్ పొజిషన్ వచ్చిన తరువాత నందమూరి కుటుంబం ఆయనని దగ్గరికి చేర్చుకుంది అని.. ఇప్పటికీ ఆయన తన బాల్య తాలూకా జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఎమోషన్ అవుతూనే ఉంటాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. చిన్నతనంలో పడిన బాధలను ఇప్పటికే గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడట తారక్. మనకు తెలిసిందే ఓ ఈవెంట్ లో భాగంగా తారక్ ఫస్ట్ టైం బాలయ్యను కలిసి స్టేజిపైనే వెక్కి వెక్కి ఏడ్చేశాడు.
అంత ఇష్టం బాలయ్య అంటే ..తారక్ కి..ఇప్పుడు అంత హ్యాపీగా కలిసిపోతున్నారు. ప్రజెంట్ అందరూ హ్యాపీగా ఒకే కుటుంబంలా కలిసిపోయారు . అంతేకాదు మొన్న తారకరత్న హెల్త్ కండిషన్ బాగో లేకపోయినా అందరూ కుటుంబ సమేతంగా వెళ్లి ఆయనని పరామర్శించి వచ్చారు . ఇది భరించలేకే కొందరు నందమూరి ఫ్యామిలీలో గొడవలు అంటూ పుకార్లు పుట్టిస్తున్నారు.. అలా పుట్టించే వాళ్లకి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చినట్లయింది నందమూరి ఫ్యామిలీ..!!