MoviesBalayya-Kajal బాల‌య్య కోసం కాజ‌ల్ ఆ ప‌నికి కూడా ఒప్పుకుందా…!

Balayya-Kajal బాల‌య్య కోసం కాజ‌ల్ ఆ ప‌నికి కూడా ఒప్పుకుందా…!

అప్పుడెప్పుడో నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ల‌క్ష్మీక‌ళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యింది పంజాబీ ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఏ ముహూర్తాన ఆమె హీరోయిన్ అయ్యిందో కాని అక్క‌డ నుంచి ఆమె అస్స‌లు వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. ఆమె ప‌ట్టింద‌ల్లా బంగారం అయిపోయింది. ఇక పెళ్లికి ముందు కూడా ఆమె సీనియ‌ర్ హీరోల‌కు మంచి ఆప్ష‌న్‌గా మారిపోయింది.

చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150లో హీరోయిన్‌గా చేసిన కాజ‌ల్‌.. ఆ త‌ర్వాత ఆచార్య సినిమాలోనూ ఆమే హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే క‌రోనా కార‌ణంగా సినిమా ఆలస్యం కావ‌డంతో అప్పుడు త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. త‌ర్వాత త‌న చిన్న‌ప్ప‌టి ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లూను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ వెంట‌నే ఓ బాబుకు కూడా జ‌న్మ‌నిచ్చేసింది.

పెళ్ల‌య్యి.. బిడ్డ పుట్టాక ఇప్పుడు కాజ‌ల్ రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె చేతిలో ఇండియ‌న్ 2 సినిమా ఉంది. ఇక తెలుగులో మ‌ళ్లీ ఆమె రీ ఎంట్రీ ఎలా ? ఉంటుందా ? అని అంద‌రూ అనుకుంటోన్న టైంలో ఏకంగా బంప‌ర్ ఛాన్స్ కొట్టేసింది. బాల‌య్య – అనిల్ రావిపూడి సినిమాలో ఆమె బాల‌య్య‌కు జోడీగా న‌టిస్తోంది. అనిల్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఈ క్యారెక్ట‌ర్‌కు కాజ‌ల్‌ను ఎంపిక చేశాడు.

రీ ఎంట్రీలో ఏకంగా బాల‌య్య లాంటి స్టార్ హీరో ప‌క్క‌న ఛాన్స్ అంటే కాజ‌ల్‌కు ల‌క్కీ ఛాన్స్ అని చెప్పాలి. ఈ సినిమా ఈ వీకెండ్ నుంచే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. అటు త‌మిళ్‌లో ఏకంగా అజిత్ లాంటి స్టార్ హీరోకు జోడీ క‌డుతోంది. ఇక బాల‌య్య సినిమా కోసం కాజ‌ల్ రు. కోటికి కాస్త త‌క్కువ‌గానే రెమ్యున‌రేష‌న్ తీసుకోబోతోంద‌ట‌. మామూలుగా కాజ‌ల్ రెమ్యున‌రేష‌న్ డిమాండ్లు హై రేంజ్‌లో ఉంటాయి.

అయితే బాల‌య్య సినిమా కావ‌డంతో పాటు త‌న సెకండ్ ఇన్సింగ్స్‌ను మ‌లుపు తిప్పుతుంద‌న్న ఆశ‌తోనే కాజ‌ల్ రెమ్యున‌రేష‌న్ కాస్త త‌గ్గించుకుంద‌ని అంటున్నారు. మ‌రి బాల‌య్య ఫామ్‌ను బ‌ట్టి ఈ సినిమా కూడా హిట్ అయితే కాజ‌ల్ కొంత కాలం టాలీవుడ్‌లో కెరీర్ కొన‌సాగించేయొచ్చు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news