Moviesఅప్ప‌ట్లో జ‌య‌మాలిని ఇంత మంది ల‌వ‌ర్సా… ఆ స్టార్ హీరోను కూడా...

అప్ప‌ట్లో జ‌య‌మాలిని ఇంత మంది ల‌వ‌ర్సా… ఆ స్టార్ హీరోను కూడా ప్రేమించిందా…!

జయమాలిని ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేటి తరం ప్రేక్షకులకు జయమాలిని గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ మొన్నటితరం ప్రేక్షకులు జయమాలిని అంటే సొల్లు కార్చేవారు. జయమాలిని అప్పట్లో స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులు వేసి అదరగొట్టింది. క్లబ్ డ్యాన్సర్ జ్యోతి లక్ష్మి సోదరిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు తో పాటు తమిళ కన్నడ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో స్టెప్పులు వేసింది. నిజాకిని జయమాలిని డ్యాన్సర్ మాత్రమే కానీ హీరోయిన్ రేంజ్‌లో క్రేజ్ ఉండేది

జయమాలిని పాట ఉందంటే ప్రేక్షకులు థియేటర్ల‌కు క్యూ కట్టేవారు. రెండు దశాబ్దాలకు పైగా జయమాలిని ఇండస్ట్రీ లో రాణించింది. ఇక ప్రస్తుతం జయమాలిని చెన్నైలో స్థిరపడింది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయమాలిని పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం మరియు సినిమా జీవితం గురించి జయమాలిని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సినిమా ఇండస్ట్రీలో చాలామంది తనకు ప్రపోజ్ చేశారని చెప్పింది.

పెళ్లి కూడా చేసుకుంటానని వెంటపడే వారని తెలిపింది. అంతేకాకుండా తనకు వచ్చే లవ్ లెటర్ లను చదవడానికి ప్రత్యేకంగా ఒక మేనేజర్ ఉండేవారని చెప్పింది. అంతేకాకుండా కొంతమంది అయితే బ్లడ్ తో కూడా ప్రేమలేఖలు రాసే వారని వెల్లడించింది. ఓ మిలటరీ ఆఫీసర్ కూడా తనకు లవ్ లెటర్ రాసారని…. పెళ్లి గురించి తన తల్లిదండ్రులతో మాట్లాడతా అన్నారని తెలిపింది. మరోవైపు కొందరు తన తల్లిని అడిగే ధైర్యం లేక తన సోదరి జ్యోతిలక్ష్మితో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసే వారని తెలిపింది.

అయితే తన వెంట అంతమంది పడినా కూడా తాను ఓ స్టార్ హీరోను ప్రేమించానని ఓపెన్ అయ్యింది. ఆ హీరో కూడా తనను ప్రేమించాడని కానీ తాము ఇద్దరం బయటపడలేదని తెలిపింది. మొదట ఆయన ప్రేమించారని ఓ సినిమా షూటింగ్ సమయంలో తన దగ్గరికి వచ్చి చెప్పడానికి చూశారని…. కానీ భయపడి చెప్పలేదని వెల్లడించింది. అయితే ఆ హీరో ఎవరు అన్నది మాత్రం జయమాలిని బయట పెట్టలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news