మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్ద సినిమాల మధ్యలో పోటీగా వచ్చిన ఈ సినిమా స్లో టాక్‌తో స్టార్ట్ అయ్యి.. రోజు రోజుకు అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవిని బాబీ వింటేజ్ బాస్‌గా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. దీనికి తోడు చిరు కం బ్యాక్ తర్వాత చిరు రేంజ్‌కు తగిన అసలు సిసలు హిట్గా వీరయ్య నిలిచింది.
ఖైదీ నెంబర్ 150 హిట్ అయినా అది రీమేక్, ఆ తర్వాత వరుసగా సైరా, ఆచార్య, గాడ్ ఫాథర్ మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో బాబి తీసిన డైరెక్ట్ ఫిల్మ్ వీరయ్య స్లోగా ఫికప్ అయ్యి ఈ రోజు బ్లాక్‌బస్టర్ టాక్‌తో వెళుతోంది. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యి సెకండ్ వీక్‌లోకి ఎంటర్ అయినా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఫికప్ అవుతోంది. ఇక ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న వీరయ్యకు ఏపీ, తెలంగాణలో అదిరిపోయే ఫిగర్లు వచ్చాయి.
ఏరియాల వారీగా ఫస్ట్ వీక్ వసూళ్లు చూస్తే నైజాంలో జీఎస్టీతో కలిపి రు. 26.5 కోట్లు – ఆంధ్రాలో 39.8 కోట్లు – సీడెడ్‌లో 14 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఓవరాల్‌గా ఈ సినిమా రు. 80 కోట్ల షేర్ కేవలం తెలుగు గడ్డ మీద మాత్రమే రాబట్టింది. అటు ఓవర్సీస్‌లో ఇప్పటికే 2 మిలియన్ డాలర్లను క్రాస్ చేసేసి 2.5 మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతోంది.
ఇక రెస్టాఫ్ ఇండియా, కర్నాటక వసూళ్లు కూడా చూస్తే వీరయ్య హవా మామూలుగా లేదు. ఖైదీ నెంబర్ 150 వసూళ్లు కూడా ఎప్పుడో క్రాస్ అయిపోయాయి. వసూళ్ల లెక్కల ప్రకారం చూస్తే చిరు కెరీర్‌లోనే వాల్తేరు వీరయ్య ఆల్ టైం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే వీరయ్య చిరు, రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్. రవితేజకు ధమాకా తర్వాత వరుసగా మరో రు. 100 కోట్ల సినిమా పడినట్లయ్యింది.