Moviesఅన్ స్టాపబుల్ షో లోనే కని విని ఎరుగని సంచలనం..ఎవ్వరు ఊహించని...

అన్ స్టాపబుల్ షో లోనే కని విని ఎరుగని సంచలనం..ఎవ్వరు ఊహించని అతిధితో బాలయ్య చిట్ చాట్..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారు మ్రోగిపోతుంది . వెబ్ మీడియా , సోషల్ మీడియా, టెలివిజన్ , నేషనల్ మీడియా అన్ని చానల్స్ లోను బాలయ్య టాక్ షో పేరు మారుమ్రోగిపోతుంది . దానికి మెయిన్ రీజన్ బాలయ్య ఎప్పుడు చేయని హీస్టింగ్ చేస్తుండటమే . కాగా ఎవరు ఊహించిన విధంగా బాలయ్య తనలోని యాంకర్ ను బయటపెడుతూ అన్ స్టాపబుల్ అనే టాక్ షో కి హోస్ట్ గా చేస్తున్నాడు . ఇప్పటికే ఆయన హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ సీజన్ వన్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే . కాగా రీసెంట్ గానే అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా స్టార్ట్ చేశారు ఆహా టీం .

కాగా ఈ క్రమంలోనే సీజన్ వన్ కి రావాలి అని కొన్ని కారణాల చేత రాలేకపోయిన గెస్ట్ లి ని తీసుకొస్తున్నాడు . ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఈ షో కి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఏకంగా 100 మిలియన్లని క్రాస్ చేసింది . అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ షో కి గెస్ట్ గా వచ్చారు. కాగా ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు స్టార్ హీరోలతో ఇంటర్వ్యూ చేసి అన్ స్టాపబుల్ ఫుల్ క్రేజ్ సంపాదించుకోగా రీసెంట్గా అదే లిస్టులోకి మరో ఇద్దరు బడా స్టార్స్ యాడ్ అవ్వబోతున్నత్లు తెలుస్తోంది.

ఈ షో కి ఇప్పుడు మరో ఇద్దరు క్రేజీ గెస్ట్ లను తీసుకురావాలనుకుంటున్నారట అల్లుఅరవింద్. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అన్ స్టాపబుల్ సీజన్ 2 కి తర్వాతి గెస్ట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కొడుకు కాబోయే సీఎం అంటూ జనాలు చెప్పుకుంటున్న మంత్రి కేటీఆర్ ఈ షో కి గెస్ట్ గా రాబోతున్నారట . అంతేకాదు ఆయనతోపాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ రామ్ చరణ్ కూడా ఈ షో కి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ తన డేట్స్ అడ్జస్ట్ చేసి ఓకే చెప్పగా ..కేటీఆర్ డేట్ ల కోసం ఆహా టీం ఎదురు చూస్తుందట. ఒకవేళ నిజంగా అదే జరిగితే ఖచ్చితంగా సినీ రాజకీయ లలో ఇదో సంచలనం అనే చెప్పాలి సినిమాలపరంగా చరణ్.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో అంటూ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . చూడాలి మరి ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news