Moviesఎవ్వడు ఏమైన అనుకోని..తగ్గేదేలే..మళ్ళీ అలాంటి పని చేస్తున్న సమంత..!!

ఎవ్వడు ఏమైన అనుకోని..తగ్గేదేలే..మళ్ళీ అలాంటి పని చేస్తున్న సమంత..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న సమంత ..ప్రజెంట్ ఎలాంటి పొజిషన్ ని ఫేస్ చేస్తుందో అందరికీ తెలిసిందే. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన రూటే మార్చేసి కేవలం సినిమాలపైనే ఫోకస్ చేసింది .కాగా ఎవరు ఊహించిన విధంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత రీసెంట్గా శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అందరి ముందే ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో తన పేరుని మరింత మారుమ్రోగి పోయేలా చేసుకుంది.

గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతల సినిమాలో నటించిన సమంత. ఈ సినిమా ఫిబ్రవరి 17న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొంటుంది సమంత . దీనికి సంబంధించిన పిక్స్ మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు . మనకు తెలిసిందే బాలీవుడ్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లల్లో ఇది ఒకటి.

సమంత కీలక పాత్ర పోషిస్తుంది . వరుణ్ ధావన్ మరో కీలక పాత్రలో కనిపించనున్న ఈ వెబ్ సిరీస్ లో కచ్చితంగా సమంతకు మంచి పేరు తీసుకొస్తుంది అంటూ సమంత ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . అయితే మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న కానీ తాను ఇచ్చిన కమిట్మెంట్స్ కి ఏ మాత్రం తగ్గని సమంత ఇలా మళ్లీ షూటింగ్లో పాల్గొనడం సమంత ఫ్యాన్స్ కు కొత్త ఊపునిస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news