టాలీవుడ్ లో నరేష్, పవిత్రా లోకేష్ వ్యవహారం ఇప్పుడు ఎంతలా వైరల్‌గా మారిందో చూస్తూనే ఉన్నాం. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని భార్యలకు విడాకులు ఇచ్చిన నరేష్ ఏడెనిమిదేళ్ల క్రితం ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న రమ్య రఘుపతితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ దంపతులకు ఓ బాబు పుట్టాక మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు.
అటు నరేష్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్‌తో ప్రేమలో పడి సహజీవనం చేస్తున్నాడన్న టాక్ ఉంది. ఇప్పుడు వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ఓ వీడియోలో లిప్‌కిస్‌తో క్లారిటీ ఇచ్చారు. అయితే వీరిద్దరి పెళ్లి జరగనివ్వను అని నరేష్ మూడో భార్య రమ్య శపథాలు చేస్తున్నారు. అసలు నరేష్‌కు తాను విడాకులు ఇవ్వలేదని.. విడాకులు ఇవ్వకుండా పవిత్రను ఎలా ? పెళ్లి చేసుకుంటాడని ఆమె ప్రశ్నిస్తున్నారు.
ఇక నరేష్‌కు, తనకు మధ్య 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని.. తన వయస్సు కంటే కేవలం 12 ఏళ్లు మాత్రమే పెద్ద అని అబద్ధం చెప్పి, మోసం చేసి నరేష్ తనను పెళ్లి చేసుకున్నాడని రమ్య ఆరోపించారు. అయితే ఈ నిజం నాకు ముందే తెలిసిందని.. అయితే నన్ను మిస్ అయిపోతానని చెప్పి మరీ పెళ్లి చేసుకున్నాడని ఆమె చెప్పారు. ఇక వేణుస్వామికి నరేష్ జాతకం చూపిస్తే ఈ మ్యారేజ్ సెట్ కాదని చెప్పినట్టు కూడా రమ్య రఘుపతి బాంబు పేల్చారు.
ఇక పెళ్లికి ముందు నరేష్ లేచిపోదామని కూడా అన్నాడని.. లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉందామని రిక్వెస్ట్ చేశాడని.. తాను అందుకు అంగీకరించకపోవడంతోనే చివరకు పెళ్లి చేసుకున్నాడని ఆమె చెప్పారు. ఇక బయట తాను భరణం తీసుకున్నట్టు జరుగుతోన్న ప్రచారంలో కూడా నిజం లేదని.. పెళ్లైన యేడాది తర్వాత నాకు బాబు పుట్టాడని ఆమె గుర్తు చేసుకున్నారు. ఏదేమైనా నరేష్‌పై రమ్య వరుసగా సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.