Moviesమనం అనుకున్నంత సైలెంట్ కాదు....న్యూ ఇయర్ రోజు సాయి పల్లవి ఏం...

మనం అనుకున్నంత సైలెంట్ కాదు….న్యూ ఇయర్ రోజు సాయి పల్లవి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

ఏ మాటకు ఆ మాటే ఇండస్ట్రీలో సాయి పల్లవి లాంటి హీరోయిన్ ఉండరు.. రారు అని మరోసారి ప్రూవ్ చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ . జనరల్గా న్యూ ఇయర్ అంటే హీరోయిన్స్ కానీ స్టార్ సెలబ్రిటీస్ కానీ పబ్బులకి వెళ్తారు.. పార్టీలకు వెళ్తారు.. ఎంజాయ్ చేస్తారు. అయితే వాటన్నిటికీ దూరంగా ఉంటూ ఆశ్చర్యానికి గురిచేసింది స్టార్ హీరోయిన్ సాయి పల్లవి . న్యూ ఇయర్ సందర్భంగా ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

తన వయసు హీరోయిన్స్ అందరూ న్యూ ఇయర్ సందర్భంగా పార్టీలు, పబ్బులకు తిరుగుతూ ఉంటే స్టార్ హీరోయిన్ సాయి పల్లవి మాత్రం పుట్టపర్తి సాయిబాబా ని దర్శించుకుంది . సాయిబాబా మందిరంలో దైవ ధ్యానంలో ఆమె మునిగి తేలిపోయిన ఫొటోస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాదాసీదా గా ఓ నార్మల్ మనిషిగా చాలా సింపుల్ గా దైవ దర్శనం చేసుకున్న సాయి పల్లవి ఫేస్ కి మాస్క్ వేసుకోవడంతో అక్కడున్న జనాలు గుర్తుపట్టలేకపోయారు.

ఈ క్రమంలోనే సాయి పల్లవి సేఫ్ గా మళ్ళీ ఇంటికి రీచ్ అయింది. ఈ ఫొటోస్ బయటకు రావడంతో సాయి పల్లవి ఇంత సింపుల్ గా మెయింటైన్ చేస్తుందా..? గ్రేట్ హీరోయిన్..మన హీరోయిన్లు చూసి నేర్చుకోవాలి అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . సాయి పల్లవి సింపుల్ గా పట్టు చీరలో చాలా పద్ధతిగా బాడీని మొత్తం కవర్ చేసుకుంటూ దైవధ్యానంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news