వివి. వినాయక్ ఒకప్పుడు టాప్ డైరెక్టర్. ఇండస్ట్రీలో ఉన్న గుసగుసల ప్రకారం వినాయక్ కథ చెపితే మహేష్‌కు నచ్చకపోవడంతో.. ఆ తర్వాత కాలంలో వినాయక్ మహేషే తనతో సినిమా చేయాలని తన వద్దకు వస్తే తప్పా తాను ఇంక మహేష్ వద్దకు వెళ్లనని అన్నాట్ట. దాదాపు 2008-09 టైంలో వినిపించిన టాపిక్ ఇది. అంటే అప్పట్లో వినాయక్ ఎంతలా వెలిగిపోయాడో తెలుస్తోంది.
దిల్ – ఆది- చెన్నకేశవరెడ్డి – ఠాగూర్ – సాంబ – అదుర్స్ – కృష్ణ ఇలా కెరీర్ స్టార్టింగ్‌లో రాజమౌళితో పోటీపడుతూ మరి వినాయక్ సినిమాలు తీశాడు. వినాయక్ మంచి మాస్ డైరెక్టర్.. అందులో సందేహం లేదు. అప్పట్లో హీరోలు మాస్‌గా ఎలివేట్ కావాలంటే వినాయక్‌తోనే సినిమాలు తీసేవారు. ఎప్పుడు అయితే బోయపాటి శ్రీను ఎంటర్ అయ్యాడో వినాయక్‌ను మించిన హీరోయిజం, మాసిజంతో హీరోలను ఎలివేట్ చేస్తూ సక్సెస్‌లు కొడుతున్నాడు.
ఇక వినాయక్ క్రమక్రమంగా డౌన్ అయిపోయాడు. అతడి టేకింగ్ కూడా దెబ్బతినేసింది. చివరకు వినాయక్ డైరెక్షన్ మర్చిపోయాడని సెటైర్లు వేసుకునే కాడకు దిగజారిపోయాడు. బద్రినాథ్ నుంచి వినాయక్ టేకింగ్ పడిపోయింది. నాయక్‌తో ఏదోలా నెట్టుకు వచ్చేశాడు. అల్లుడు శీను గ్రాండ్ లాంచింగ్‌తో గట్టెక్కేసింది. ఇక ఖైదీ నెంబర్ 150 సినిమా రీమేక్.. అదికూడా వినాయ్‌ను పక్కన పెట్టేసి మరీ తీసినట్టుగానే ఉంది. ఇండస్ట్రీలో జరిగింది ఇదే అన్న టాక్ కూడా ఉంది.
ఇక ఇంటిలిజెంట్ సినిమా చూసినోళ్లు అయితే అసలు వినాయక్ డైరెక్షన్ మర్చిపోయాడనుకున్నారు. చివరకు మోఖానికి రంగేసుకుని శీనయ్యగా హీరో అవతారం ఎత్తాడు. ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇప్పుడు మాస్ మహరాజ్ రవితేజకు వినాయక్ ఓ కథ చెప్పాడని ఆ కథ నచ్చడంతో వినయ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు.
అసలు ఒకప్పుడు వినాయక్‌తో సినిమా కోసం క్యూలో ఉన్న స్టార్ హీరోలు.. ఇప్పుడు అసలు వినాయక్ కథ చెపుతానంటే పట్టించుకోని మిడిల్ రేంజ్ కన్నా తక్కువ హీరోలు అన్నట్టుగా వినాయక్ పరిస్థితి మారింది. మరి రవితేజ వినాయక్‌లో ఏం చూసి.. ఏం నమ్మి డేట్లు ఇచ్చాడో అర్థం కావడం లేదు. అసలే రవితేజ ధమాకాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. రేపు వినాయక్ నిండా ముంచేస్తే మళ్లీ కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో ? చూడాలి.