Moviesఆ పని ఇప్పుడు చేసుంటే.. నా బ్రతుకు ఎప్పుడో బాగుపడేది.. ప్రగతి...

ఆ పని ఇప్పుడు చేసుంటే.. నా బ్రతుకు ఎప్పుడో బాగుపడేది.. ప్రగతి డేర్ కి దండం రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం . ఇది ఓ మాయా లోకం. ఈ గ్లామరస్ ఫీల్డ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు. ఎలాంటి హీరో హీరోయిన్స్ అయినా సరే ఈ మాయలకు బలి అవ్వాల్సిందే. చాలా రేర్ గా మాత్రమే ఇండస్ట్రీలో కంటిన్యూగా స్టేబుల్ గా కొనసాగే హీరోయిన్స్ కనిపిస్తూ ఉంటారు. కాగా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయినా ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు . ఆ లిస్ట్ లోకే వస్తుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి .

ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . కరోనా లాక్ డౌన్ టైం లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాని షేక్ చేసేసింది. తన వర్కౌట్ వీడియోస్ తో తన బ్యూటీ టిప్స్ తో జనాలకు మరింత దగ్గర అయింది . అంతేకాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో ప్రగతి తర్వాతే ఎవరైనా అని చెప్పకు తప్పదు. కాగా రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను ఎందుకు హీరోయిన్గా ఎదగలేకపోయాను అని క్లారిటీ ఇచ్చింది.

మనకు తెలిసిందే 1997 వరకు ఆమె సినిమాల్లో హీరోయిన్గా చేసింది . అఫ్ కోర్స్ చేసింది తక్కువ సినిమాలే.. అయినా నటన పరంగా మెప్పించింది . ఇక ఆ తర్వాత ఎర్లీగా పెళ్లి చేసుకుని తన లైఫ్ని నాశనం చేసుకుంది . అప్పట్లో అదో మూర్ఖత్వం అని.. నేను చెప్పిందే జరగాలన్న మొండితనం అని ..ఆ కారణంగా నా జీవితం బలైపోయింది అని చెప్పుకొచ్చింది . ఇక ఆ తర్వాత కరెక్ట్ ఆర్టిస్ట్ గా లైఫ్ కొనసాగించిన ప్రగతి ..

తన లైఫ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్నప్పుడు పెట్టిన ఫోకస్.. హీరోయిన్గా చేస్తున్నప్పుడు పెట్టుంటే నా జీవితం ఎప్పుడో బాగుపడి ఉండేదని చెప్పుకోరావడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో ఇలా అందం నటన ఉన్నా కానీ కొన్ని కొన్ని తప్పులు కారణంగా హీరోయిన్ గా ఎదగలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్న ముద్దుగుమ్మలు ఎక్కువమంది ఉన్నారు. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది ప్రగతి ఆంటీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news