Moviesమహేశ్ తో గోడవలు..కూతురుని రంగంలోకి దించుతున్న బన్నీ..!!

మహేశ్ తో గోడవలు..కూతురుని రంగంలోకి దించుతున్న బన్నీ..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాపై ఏ అప్‌డేట్ వ‌చ్చినా ఆస‌క్తిగా మారుతోంది. త్రివిక్ర‌మ్ అల వైకుంఠ‌పురంలో సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి ప‌డేశాడు. ఇక అత‌డు, ఖ‌లేజా సినిమాల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు అయితే మామూలుగా లేవు. 2010లో వచ్చిన ఖలేజా త‌ర్వాత 12 ఏళ్ల‌కు మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా వ‌స్తోంది.

మ‌హేష్‌తో పాటు త్రివిక్ర‌మ్ ఇద్ద‌రు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ సినిమాను ఈ యేడాది ద‌స‌రాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమాలో ఏడేళ్ల పాప పాత్ర ఉంద‌ట‌. ఆ పాప పాత్ర చుట్టూనే క‌థ న‌డుస్తుంద‌ట‌. ఈ పాప పాత్ర చాలా కీల‌కంగా ఉంటుంద‌ట‌.

ఆ పాప పాత్ర‌లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి చిన్నారి ‘అల్లు అర్హా’ ను న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇటు మ‌హేష్ కూతురు సితార‌తో పాటు అటు బ‌న్నీ కూతురు అర్హ కూడా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్నారు. మ‌రి ఈ వార్త నిజం అయితే అటు బ‌న్నీ ఫ్యాన్స్ నుంచి కూడా ఈ క్రేజీ మూవీకి ఎలాంటి స‌పోర్ట్ ఉంటుందో ? చెప్ప‌క్క‌ర్లేదు.

అయితే అర్హ మ‌హేష్ సినిమాలో నటించేందుకు అల్లు ఫ్యామిలీ ఒప్పుకుంటుందా ? అన్న సందేహం అయితే ఉంది. అర్హ ఇప్ప‌టికే స‌మంత శాకుంత‌లం సినిమాలో న‌టిస్తోంది. అర్హ‌ను ఈ సినిమాలో న‌టించేందుకు అల్లు ఫ్యామిలీ ఓకే చెపితే అది సంచ‌ల‌న‌మే. ఇప్ప‌టికే బ‌న్నీ – మ‌హేష్ మ‌ధ్య కాస్తంత గ్యాప్ ఉంద‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో ఇది శుభ ప‌రిణామం అవుతుంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. గ‌తంలో మ‌హేష్‌, పూజ కాంబోలో వ‌చ్చిన మ‌హ‌ర్షి సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news