Moviesఒక్క మాట తో షన్ను కి బిగ్ రాడ్ దించేసిన దీప్తీ.....

ఒక్క మాట తో షన్ను కి బిగ్ రాడ్ దించేసిన దీప్తీ.. పాపం ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో..?

సినిమా ఇండస్ట్రీలోనే కాదు బుల్లితెరపై సోషల్ మీడియాలో ఎన్నో జంటలు ప్రేమించుకుని పెళ్లికి ముందే విడిపోతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు. కాగా అందులో యూట్యూబ్ జంట దీప్తి సునైనా – షణ్ముఖ్ జశ్వంత్ కూడా ఒకరు . మనకు తెలిసిందే సోషల్ మీడియాలోనే నెంబర్ వన్ యూట్యూబఅర్ గా పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్.. తన ఫ్రెండ్ దీప్తి సునైన గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు . అయితే ఎవరు ఊహించిన విధంగా ఈ జంట ఈ మధ్యనే విడిపోయింది .

దానికి మెయిన్ రీజన్ బిగ్ బాస్ సీజన్ లో షణ్ముఖ్ జశ్వంత్ తోటి కంటెస్టెంట్ సిరి తో నడిపిన ప్రేమ కాని ఫ్రెండ్ షిప్ .. వల్గర్ బిహేవియర్ అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ తీరు ప్రవర్తన మొత్తం మారిపోయిందని .. ఆయన ఫ్యాన్స్ కూడా టార్గెట్ చేసే విధంగా బిగ్బాస్ హౌస్లో బిహేవ్ చేశాడు షన్ను. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి రాగానే షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసిన దీప్తి .. ప్రజెంట్ కెరియర్ పై ఫోకస్ చేస్తుంది .

ఈ క్రమంలోనే రీసెంట్గా “ఏమోనే” అనే కవర్ సాంగ్ చేసి సోషల్ మీడియాలో హ్యూజ్ పబ్లిసిటీని సంపాదించుకుంది . ఏకంగా రెండు మిలియన్ వ్యూస్ దక్కించుకున్న దీప్తి సునయన .. ఈ పాటపై సోషల్ మీడియాలో జనాలు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు . కాగా ఇదే క్రమంలో ఓ నెటిజన్..” ప్రేమించుకున్న ప్రతి అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు కానీ .. పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు మాత్రం ఖచ్చితంగా ప్రేమించుకుంటారు “అంటూ కామెంట్ పెట్టాడు . అయితే అన్ని కామెంట్స్ మధ్యలో ఈ కామెంట్ ని స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసుకోవడంతో దీప్తి సునయన పరోక్షకంగా షణ్ముఖఖ్ ని టార్గెట్ చేసిందని.. ఇక జన్మలో దీప్తి సునయన-షన్ను కలవారు అంటూ కొందరు జనాలు కామెంట్ చేయడం సోషల్ మీడియాలోనే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news