కేథరీన్ థ్రెసా..ఇండస్ట్రీలో ముద్దుగా బొద్దుగా ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు. కళ్ళు, పెదవులు చూస్తే యూత్ ఆడియన్స్‌కి కాస్త మత్తెక్కేస్తుంది. మత్తు కళ్ళు బిగుతైన ఎద అందాలు..వెనక చూస్తే మతిపోతుంది. ఇన్ని సెక్స్ అపీల్ పార్ట్స్ ఉన్న కేథరీన్ కెరీర్ ఎందుకనో నత్త నడకన సాగుతోంది. పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను, కృష్ణవంశీ, దాసరి నారాయణ రావు లాంటి వారి దర్శకత్వంలో నటించిన క్రెడిట్ ఉంది.
అసలు బన్నీ లాంటి హీరోయిన్లు అయితే కేథరిన్‌కు ఎలా ? ఛాన్సులు ఇవ్వాలో అలా ఇచ్చేశారు. బన్నీ ఆమెకు ఏకంగా మూడుసార్లు ఛాన్స్ ఇచ్చాడు. కానీ, ఒక్క భారీ కమర్షియల్ హిట్ కేథరీన్ ఖాతాలో లేదు. పర్ఫార్మెన్స్ పరంగా సూపర్. అందం..గ్లామర్..హీరోలతో చేసే రొమాన్స్‌ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క దాసరి నారాయణ రావు గారు తప్ప మిగతా దర్శకులందరూ కేథరీన్ను ఓ రేంజ్‌కి మించి తెర మీద అందంగా చూపించిన వారే. కాని, పెద్ద కమర్షియల్ హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోతుంది.
చెప్పాలంటే స్క్రీన్ మీద అన్ని రకాలుగా కేథరీన్ సంతృప్తి పరుస్తోంది. కానీ, ఎక్కువమంది హీరోలకి, దర్శకనిర్మాతలకి బెస్ట్ ఛాయిస్ కాలేకపోతోంది. అసలు ఎందుకు కేథరీన్‌ని మన దర్శకులు వాడటం లేదు అనేది చాలామందికి సందేహం. ముంబై హీరోయిన్స్లాగా అందంగా ఉన్నా భాష అర్థం కాక మన తెలుగు ప్రేక్షకులకి నచ్చరు. కానీ, కేథరీన్ అలా కాదు.
దాదాపుగా చూసేందుకు బయటగానీ, స్క్రీన్ మీద గానీ తెలుగమ్మాయి మాదిరిగానే ఉంటుంది. ఇటీవలే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో ఓ హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, రవితేజ హీరోలుగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజా సరసన నటిస్తోంది. ఈ సినిమాతోనైనా కేథరీన్‌కి దక్కాల్సిన క్రేజ్, పాపులారిటీ దక్కుతుందో లేదో చూడాలి.