Moviesఇంట్రెస్టింగ్: ఇప్పటి వరకు ఏ సినిమాకి చేయని పనిని.. ఫస్ట్ టైం...

ఇంట్రెస్టింగ్: ఇప్పటి వరకు ఏ సినిమాకి చేయని పనిని.. ఫస్ట్ టైం ఆ మూవీ కోసం చేసిన బన్నీ..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని స్టార్ స్టేటస్ దక్కించుకున్న బన్నీ ..పుష్ప సినిమాతో బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు. కాగా అప్పటివరకు కేవలం స్టైలిష్ లుక్స్, డాన్స్ కి పరిమితమైన బన్నీని.. ఆ సినిమానే నటుడిగా నిలబెట్టింది . అప్పటివరకు బన్ని చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు,, పుష్ప సినిమా మాత్రమే మరొక ఎత్తు అనేంతలా బన్నీ ఫాన్స్ ను అట్రాక్ట్ చేసింది .

 

కానీ పుష్ప సినిమా కోసం ఫస్ట్ టైం ఆయన తన భాషను ప్రాక్టీస్ చేశాడు. ఎస్ మనకు తెలిసిందే పుష్ప సినిమా మొత్తం చిత్తూరు యాసతో నడుస్తుంది. అయితే మొదటి నుంచి చిత్తూరు స్లాంగ్ బన్నీ కి పెద్ద గా రాదు. ఈ క్రమంలోని సినిమా కోసం.. సినిమాలో నాచురల్ లుక్స్..ఆ నాచురాలిటీ కోసం బన్నీ దాదాపు మూడు నెలలు కష్టపడి ..ఆ భాషను ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని నేర్చుకున్నాడట .

ఇప్పటివరకు తన ఏ సినిమా కోసం.. ఈ విధంగా కష్టపడలేదని.. కేవలం పుష్ప కోసం మాత్రమే తన భాషను తన బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవడానికి ఇంత కష్టపడ్డాడని తెలుస్తుంది. ఏది ఏమైనా సరే బన్నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఊ సినిమా రిలీజ్ అయి సంవత్సరం అయిపోయినా ఇంకా సినిమాలోని పాటలు, సినిమాలోని డైలాగ్స్ మారుమ్రోగిపోతున్నాయి అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ బన్నీ నటన అనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news