గత పదేళ్ళుగా మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసిన న్యూస్ ఎట్టకేలకు రివీల్ చేశాడు చిరంజీవి. మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి . కాగా అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఉపాసనకి రాంచరణ్ కి సంబంధించిన కొన్ని న్యూస్లు వైరల్ అవుతూనే ఉన్నాయి.
కాగా రీసెంట్గా మెగాకోడలు ఉపాసన వాళ్ళ నానమ్మ చనిపోయారు . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేస్తూ ఉపాసన తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది . ” నేను నా లైఫ్ లో మంచి వ్యక్తిని కోల్పోయాను అంటూ బాధపడింది. చివరి వరకు నువ్వు ఎలా అయితే డిగ్నిటీగా, ప్రేమగా, నిజాయితీగా ఉన్నావ్ లో నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తాను .
జీవితాన్ని చూస్తూ నేను ఏంతో నేర్చుకున్నా.. ఎలా జీవించాలో తెలుసుకున్నానని పేర్కొంది. ఈరోజు నాన్నమ్మ తన జీవితాన్ని చలించి నిష్క్రమించింది. పుష్ప నాని నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె ప్రేమను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నేను నా తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మల నుంచి ఎంతో ప్రేమని అందుకున్నాను.. రేపు ఇదే అనుభవాలను నా పిల్లలకు అందిస్తానని వాగ్దానం చేస్తున్నానని ఉపాసన .. మిస్ యు అంటూ పోస్ట్ చేసింది .
ఈ పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారింది . కాగా కడుపుతో ఉన్న ఉపాసన డెలివరీ అయితే చూడాలి అని ..ముని మనవడిని ఎత్తుకోవాలి అని ఉపాసన నానమ్మ ఎంతో ఆశ పడ్డారట. కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోయారు అంటూ బాధపడుతున్నారు ఉపాసన ఫ్యామిలీ మెంబర్స్ .ఇది నిజంగా ఉపాసన కి షాకింగ్ అనే చెప్పాలి..!!