Moviesనందమూరి బిడ్డా మజాకా..ఏం పీకుంటారో పీకోండి..ఆ విషయంలో తగ్గేదేలే..!!

నందమూరి బిడ్డా మజాకా..ఏం పీకుంటారో పీకోండి..ఆ విషయంలో తగ్గేదేలే..!!

సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీదనే మాట్లాడటంలో బాలయ్య నెంబర్ వన్ . ఇలా మన ఇండస్ట్రీలో మాట్లాడే దమ్మున్న హీరోలు చాలా తక్కువ . చాలా సరదాగా జోవియల్ గా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు . ఈ మధ్యకాలంలో అన్ స్టాపబుల్ షో వచ్చిన ప్రతి ఒక్కరూ బాలయ్యను ఏ రేంజ్ లో పొగిడేసారో తెలిసిందే.

అయితే అలాంటి చనువుతోనే సరదాగా బాలయ్య వీర సింహారెడ్డి సెలబ్రేషన్స్ లో భాగంగా అక్కినేని తొక్కినేని అంటూ మాట తూలారు. దీంతో కావాలనే కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ ఆయనని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . అక్కినేని అభిమానులకు బాలయ్య క్షమాపణలు చెప్పాలని .. బహిరంగంగా క్షమాపణ లేఖను రిలీజ్ చేయాలి అంటూ భీష్ముంచుకుని కూర్చున్నారు.

అంతేనా పలుచోట్ల రచ్చ రచ్చ చేస్తున్నారు . అయితే నందమూరి బాలయ్య మాత్రం ఏం పీక్కుంటారో పీక్కోండి నేను తగ్గేదేలే అన్న రేంజ్ లో ధీమాగా ఉన్నారు. ఇంత ఇష్యూ జరుగుతున్న అక్కినేని తొక్కినేని అన్న పదం గురించి పట్టించుకోవట్లేదు బాలయ్య . రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు . అంతేకానీ అయితే అక్కినేని ఇష్యూ గురించి ఏం మాత్రం స్పందించలేదు . ఈ క్రమంలోని నందమూరి ఫ్యాన్స్ బాలయ్య లోని డేరింగ్ యాంగిల్ కు ఫిదా అవుతున్నారు . నందమూరి బాలయ్య ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news