నందమూరి నటసింహం అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీరసింహారెడ్డి సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి దిగుతోంది. ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద హీరోల సినిమాల మధ్యలో వీరసింహారెడ్డి దిగుతోంది. అదే రోజు దిల్ రాజు నిర్మాతగా కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ నటిస్తోన్న వారసుడు కూడా రిలీజ్ అవుతోంది.
ఇక ఆ మరుసటి రోజే చిరంజీవి వాల్తేరు వీరయ్య థియేటర్లలోకి దిగుతోంది. ఇక 11న అజిత్ తెగింపు కూడా తెలుగులో వస్తోంది. ఇక వీటితో పాటు మరో రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ అన్ని సినిమాల కంటే మాస్‌లో బాగా ఆసక్తి రేపుతోన్న సినిమా బాలయ్యదే. అఖండ తర్వాత బాలయ్య వీరసింహారెడ్డిగా థియేటర్లలోకి దిగుతున్నాడు.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వీరసింహారెడ్డి ప్రి ప్రోడక్షన్ పనులు కంప్లీట్ చేసుకునే దశలో ఉంది. ఇక ఈ సినిమా రన్ టైం బయటకు వచ్చేసింది. ఈ సినిమా రన్‌టైమ్ రెండు గంటల నలభై మూడు నిమిషాలకు లాక్ అయిందని తెలుస్తోంది. అంటే ఓవరాల్‌గా 163 నిమిషాల పాటు నడుస్తుంది. రెండున్నర గంటల కంటే మరో 13 నిమిషాలు ఎక్కువే. మామూలుగా ఈ రన్ టైం కాస్త ఎక్కువే.
అయితే ఇటీవల కాలంలో హిట్ అయిన రంగస్థలం, పుష్ప, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాల రన్ టైం కూడా చాలా ఎక్కువే. అయితే సినిమాలో కూర్చోపెట్టే దమ్ముంటే రన్ టైం ఎక్కువ అయినా ప్రేక్షకుడు పట్టించుకోకుండా సినిమాలో లీనమై ఎంజాయ్ చేస్తాడు. రన్ టైం ఎక్కువుగా ఉన్నట్టు అనిపించడంతో ఫ్యాన్స్‌లో కాస్త టెన్షన్ ఉన్నా సినిమా అఖండ రేంజ్‌లో ఉంటుందన్న బాలయ్య ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.