Moviesఒక్క సినిమా హిట్టయితేనే వందసార్లు డబ్బా..ఈ స్టార్ కొడుకు డబ్బులిచ్చి కటౌట్లు...

ఒక్క సినిమా హిట్టయితేనే వందసార్లు డబ్బా..ఈ స్టార్ కొడుకు డబ్బులిచ్చి కటౌట్లు పెట్టించుకుంటాడా..?

సినిమా ఇండస్ట్రీలో పబ్లిసిటీ లేనిదే పని జరగదు . ఎలాంటి హీరో అయినా.. స్టార్ హీరో కొడుకు అయినా సరే తన సినిమాను .. పబ్లిసిటీ చేసుకోకుండా కాళ్లు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అలాంటి సందర్భాలు ఇండస్ట్రీలో మనం ఎన్నో చూసాం . అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే స్టార్ హీరో మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే చేసిన సినిమాలు చాలా తక్కువ ..అందులో హిట్ కొట్టింది ఒకటో రెండో ..అయితే స్టార్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ..ఈ హీరో మాత్రం హెడ్ వెయిట్ విషయంలో నెంబర్ వన్.

ఏ ప్రెస్ మీట్ పెట్టినా.. ఇంటర్వ్యూ కి వెళ్లిన తన గురించి తానే హంగామా చేసుకుంటూ ..డప్పు కొట్టుకుంటూ ఉంటాడు . మరీ ముఖ్యంగా ఈయన తన కెరియర్ లో నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఒకే ఒక్క సినిమా . ఆ సినిమా హిట్ అయిన టైంలో ఈ హీరో ప్రవర్తించిన తీరు చూసి సొంత ఫాన్స్ కు సైతం ఓవర్ చేస్తున్నాడు రా బాబు అనిపించేంతలా ఉండింది . హిట్ అయిన సినిమా గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఇప్పటివరకు హిట్టు కొట్టని ఈ హీరో సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటారు.

కాగా ఈ హీరో తన సొంత ఫ్యాన్స్ ని సైతం చీట్ చేశారన్న న్యూస్ వైరల్ అవుతుంది. తన సినిమా ప్రమోషన్స్ కోసం హంగామా చేయడానికి కొంతమంది జనాలకు డబ్బులు ఇచ్చి మరి పబ్లిసిటీ చేయించుకుంటున్నాడని.. ఫ్లెక్సీలు కూడా తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ..ఈ విధంగా తన సినిమా రిలీజ్ అయినప్పుడు హంగామ చేస్తుంటాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది .ఏది ఏమైనా సరే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో కొడుకు స్టార్ హీరో అవ్వాలన్న రూల్ మాత్రం లేదని ..మరోసారి ఈ హీరో ప్రూవ్ చేశాడు. ప్రజెంట్ హీరో అటు సినిమాల లేక ఇటు ఫాలోయింగ్ లేక సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news