Moviesటాలీవుడ్‌లో సింగర్స్ కూడా క‌మిట్‌మెంట్ ఇచ్చి ప‌క్క‌లోకి రావాల్సిందేనా..?

టాలీవుడ్‌లో సింగర్స్ కూడా క‌మిట్‌మెంట్ ఇచ్చి ప‌క్క‌లోకి రావాల్సిందేనా..?

సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలంగా రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవి కూడా పెద్దవాళ్ళకి సంబంధించినవే కావడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ప్రధానంగా కమిట్‌మెంట్, కాస్టింగ్ కౌచ్ అనే పదాలు గత కొన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. బాలీవుడ్‌లో ఒకప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం ఉండేది. కానీ, గడిచిన నాలుగైదేళ్ళలో అక్కడ కూడా నటీమణులను, గాయనీలను వేధించిన వారు లేకపోలేదని బయటకి వస్తున్నాయి.

వేధించడం కాకపోయినా ప్రముఖ గాయకుడు..మరో ప్రముఖ గాయనీ శ్రేయా ఘోషాల్‌ను ఛాన్స్ దొరికినప్పుడు ఆన్ కెమెరాల ముందు ముద్దు పెట్టుకున్నారు. ఆయనెవరో కాదు..ఉదిత్ నారాయణ్. ఇక సింగర్ కైలాష్ ఖేర్ తోటి సింగర్స్‌ను ఇబ్బంది పెట్టేవాడని సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్ చేశాయి. తమిళంలో ప్రముఖ సాహిత్య రచయిత వైరిముత్తు సింగర్ చిన్మయి శ్రీపాదను శారీరకంగా హింసించారని ఆమె చాలాసార్లు వాపోయింది.

అస‌లు చిన్మ‌యి వైరిముత్తును ఎప్ప‌టిక‌ప్పుడు దారుణంగా టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తోంది కూడా..!
ఇక సంగీత దర్శకులు కూడా కొందరు కొత్తగా వచ్చే సింగర్‌కి అవకాశం ఇవ్వాలంటే వారికి నచ్చినట్టు కమిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారట. ఇది బాలీవుడ్‌తో పాటు సౌత్ భాషలలోనూ గత కొంతకాలంగా వినిపిస్తున్న మాట. ఈ పోటీ ప్రపంచంలో ఒక్క ఛాన్స్ అంటూ వేయి కళ్ళతో అవకాశం కోసం ఎదురుచూసేవారు ఎంతమందో ఉన్నారు.

అదే అదునుగా చేసుకొని సంగీత దర్శకులు సింగర్‌గా ఛాన్స్ ఇవ్వాలంటే కమిటవ్వాల్సిందేనట. వారి ప‌క్క‌లోకి వెళ్లాల్సిందే అట‌. తెలుగులోనూ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లుగా ఉన్న వారిలో ఒక‌రిద్ద‌రు కొత్త సింగ‌ర్ల బ‌ల‌హీన‌త‌ల‌ను ఆస‌రాగా చేసుకుని క‌మిట్‌మెంట్ ఇవ్వాల‌ని ప్రెజ‌ర్ చేస్తున్నార‌ట‌.

ఇదే ఓ సమస్య అయితే, మన తెలుగు సింగర్ పాట పాడితే చాలా తక్కువ రెమ్యునరేషన్ చేతిలో పెడతారట. దీనిపై గతంలో చాలామంది సింగర్స్ ఈ విషయాన్ని మీడిదా ద్వారా బయటకి చెప్పారు. ఎవ‌రైనా ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అడిగితే నీకు ఛాన్స్ ఇవ్వ‌డ‌మే ? ఎక్కువ అన్న‌ట్టుగా కూడా మాట్లాడ‌తార‌ట‌. ఈ కారణాల వల్లే అద్భుతమైన సింగర్స్ ఉన్నా కూడా ఎక్కువ కాలం కొనసాగలేకపోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news