Moviesమెగా హీరోయిన్లను నమ్మి మోస‌పోయిన నంద‌మూరి హీరోలు... న‌లుగురూ దెబ్బేశారే...!

మెగా హీరోయిన్లను నమ్మి మోస‌పోయిన నంద‌మూరి హీరోలు… న‌లుగురూ దెబ్బేశారే…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, నందమూరి ఫ్యామిలీలకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. మెగా హీరోల సినిమాలు, నందమూరి హీరోల సినిమాలు ఒకే సమయంలో థియేటర్లలో విడుదలైతే ఆ హడావిడి మామూలుగా ఉండదనే సంగతి తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా కేవలం ఒక్కరోజు గ్యాప్ లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ రెండు సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్లను సాధించే సినిమా ఏది అనే చర్చ అభిమానుల మధ్య ఇప్పటికే జరుగుతోంది.

అయితే మెగా హీరోలకు జోడీగా నటించిన హీరోయిన్ల కాంబినేషన్ ను రిపీట్ చేస్తే మాత్రం నందమూరి హీరోలకు షాక్ తగిలిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఇంద్ర ఒకటి. బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఇంద్ర సినిమా అంచనాలకు మించి సంచలన విజయాలను సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేసింది.

అయితే ఈ సినిమాలోని హీరోయిన్ల కాంబినేషన్ ను బాలయ్య హీరోగా తెరకెక్కిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలో కూడా రిపీట్ చేశారు. పలనాటి బ్రహ్మనాయుడు సినిమాకు కూడా బి.గోపాల్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే నటించిన ఇంద్ర బ్లాక్ బస్టర్ అయితే పలనాటి బ్రహ్మనాయుడు డిజాస్టర్ అయింది. చిరంజీవి మూవీ హీరోయిన్ల కాంబినేషన్ బాలయ్యకు మాత్రం అచ్చిరాలేదనే చెప్పాలి.

మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఫస్ట్ హాఫ్ లీకైనా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ సినిమాలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ హీరోయిన్ల కాంబినేషన్ ను జూనియర్ ఎన్టీఆర్ నటించిన రభస మూవీకి రిపీట్ చేయగా రభస మూవీ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.

అయితే రభస సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన సమంత ఎన్టీఆర్ తో కలిసి ఈ సినిమా కాకుండా బృందావనం, రామయ్యా వస్తావయ్యా, జనతా గ్యారేజ్ సినిమాలలలో నటించింది. ఈ సినిమాలలో బృందావనం, జనతా గ్యారేజ్ హిట్లుగా నిలిస్తే రామయ్యా వస్తావయ్యా సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news