Moviesకాజ‌ల్‌కు ఉన్న క్రేజ్ స‌మంత‌కు లేదా... ఇంత లైట్ అయిపోయిందా.. ఇంత‌క‌న్నా...

కాజ‌ల్‌కు ఉన్న క్రేజ్ స‌మంత‌కు లేదా… ఇంత లైట్ అయిపోయిందా.. ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా..!

చెన్నై చిన్న‌ది స‌మంతకు యేడాదిన్న‌ర క్రితం వ‌ర‌కు సోష‌ల్ మీడియాలోనూ, ఇంట‌ర్నెట్ సెర్చింగ్‌లోనూ తిరుగులేని పాపులారిటీ ఉండేది. నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత‌కు వ‌రుస‌గా ఏదో ఒక ప్రాబ్ల‌మ్స్ వ‌స్తూనే ఉన్నాయి. చైతుతో విడాకుల‌తో వైవాహిక బంధం తెగిపోయింది. త‌ర్వాత స‌రైన హిట్ లేదు. ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చిన య‌శోద క‌మ‌ర్షియ‌ల్ ప్లాప్‌. గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం కూడా ఎప్పుడు వ‌స్తుందో తెలియ‌ట్లేదు.

విజ‌య్ దేవ‌ర‌కొండతో చేస్తోన్న ఖుషి మ‌ధ్య‌లో ఆగింది. మ‌రోవైపు అనారోగ్య స‌మ‌స్య‌లు.. ఈ ప్ర‌భావాలే స‌మంత ప‌ట్ల ఉన్న క్రేజ్ త‌గ్గ‌డానికి కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయి. తాజాగా ఈ యేడాది గూగుల్ సెర్చింగ్‌లో టాప్‌లో నిలిచిన హీరోయిన్ల లిస్టు బ‌య‌ట‌కు వ‌చ్చింది. విచిత్రం ఏంటంటే ఇప్ప‌టికే పెళ్లి చేసుకుని పిల్ల‌ను క‌న‌డంతో పాటు ఫేడ‌వుట్ అయిపోయిన కాజ‌ల్ గ‌తేడాదిలాగానే ఫ‌స్ట్ ప్లేసులో నిలిచింది.

కాజ‌ల్ చేతిలో స‌మంత‌కు ఉన్న‌న్ని సినిమా ఛాన్సులు లేవు. పైగా అన్ని కాంట్ర‌వ‌ర్సీలు కూడా ఆమెకు ఉండ‌వు. అయితే పెళ్లి, బాబుకు జ‌న్మిన‌వ్వ‌డం లాంటి విష‌యాల‌తో కాజ‌ల్ పాపుల‌ర్ అయ్యింది. స‌మంత క్రేజ్ కాజ‌ల్‌తో పోల్చినా రెండో ప్లేస్‌కు ప‌డిపోయింది. ఇక ఈ యేడాది గూగుల్ సెర్చింగ్‌లో టాప్ 1 కాజ‌ల్‌, 2 స‌మంత త‌ర్వాత వ‌రుస‌గా మూడో స్థానంలో రష్మిక, నాలుగో స్థానంలో తమన్న నిలిచారు.

విచిత్రం ఏంటంటే ర‌కుల్ ఈ యేడాది పూర్తిగా పాపులారిటీ కోల్పోయింది. ఆమె ఏకంగా 10వ స్థానంలోకి ప‌డిపోయింది. టాప్ లిస్టులో ఉన్న హీరోయిన్ల‌ను ఓ సారి చూస్తే… 1. కాజల్, 2. సమంత, 3. రష్మిక, 4. తమన్న, 5. నయనతార, 6. అనుష్క, 7. పూజాహెగ్డే, 8. కీర్తిసురేష్, 9. సాయిపల్లవి, 10.రకుల్ ప్రీత్

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news