Moviesవావ్: అన్ స్టాపబుల్ షో కి పవన్ కళ్యాణ్..ఎవ్వరు ఊహించని సర్...

వావ్: అన్ స్టాపబుల్ షో కి పవన్ కళ్యాణ్..ఎవ్వరు ఊహించని సర్ ప్రైజ్ ఇది.. ఆ రోజునే స్ట్రీమింగ్..!!

వావ్ ..వావ్.. వావ్ ఇది నిజంగా ఓటీటిలకే సంచలనం అని చెప్పాలి . ఇప్పటి వరకు ఇలాంటి ఎపిసోడ్ రాలేదు ..ఇకపై వస్తుందన్న నమ్మకము లేదు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . ఒక పక్క సినిమాలతో మరోపక్క పాలిటిక్స్ తో రెండిట్లోనూ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వస్తున్నారా..? అంటే అవునని అంటున్నారు సినీ వర్గాలు . అంతేకాదు ఈ న్యూస్ తెలిసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు ,

మరీ ముఖ్యంగా బాలయ్యను పవన్ కళ్యాణ్ ని ఒకే స్క్రీన్ పై చూడడం చాలా ఆనందం కలిగిస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు . ఇప్పటివరకు అన్ స్టాపబుల్ షో చాలామంది పెద్ద వ్యక్తులు వచ్చారు. బడా సెలబ్రిటీస్ వచ్చారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షో కి వస్తున్నాడు అనగానే వచ్చిన క్రేజ్, రెస్పాన్స్, బజ్ ఏ ఎపిసోడ్ కి రాలేదు. ఈ ఎపిసోడ్ స్పెషల్ చాలా చాలా స్పెషల్ అంటున్నారు పవన్ ఫ్యాన్స్ . మరి ముఖ్యంగా ప్రజెంట్ ఉన్న సినీ పోజీషన్ కి..పాలిటిక్స్ హీట్ కి..వీళ్ళ డిస్కషన్స్ మరింత హీట్ పుట్టిస్తాయి అంటున్నారు.

అంతే కాదు ఇన్నాళ్లు టాక్ షోలకి ఇంటర్వ్యూలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ..బాలయ్య షో అనగానే ఇంట్రెస్ట్ చూపించి మరి ..బిజీగా ఉన్న కాల్ షీట్స్ ని అడ్జస్ట్ చేశాడట. డేట్స్ ఇచ్చి మరి బాలయ్య కోసం రెడీ అయ్యారట . అంతేకాదు అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరి కి సంబంధించిన ఎపిసోడ్ ఆదివారం షూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ విజువల్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడేలా ప్లాన్ చేసుకుంటున్నారట ఆహ టీం. క్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయనున్నారు అని తెలుస్తుంది . అంతేకాదు పవన్ కళ్యాణ్ ఈ షోలో పాలిటిక్స్ గురించి ఎక్కువగా చర్చించే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఏది ఏమైనా సరే పాలిటిక్స్ – సినిమాలు పక్కన పెడితే ఇద్దరూ మల్టీ టాలెంటెడ్ హీరోలను ఒకే తెరపై చూస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు . ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అంటూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు పవన్ – నందమూరి ఫ్యాన్స్. చూడాలి మరి ఆ గుడ్ మూమెంట్ ఎప్పుడు రాబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news