తెలుగు సినిమా ఇండస్ట్రీలో 20 ఏళ్ల క్రితం హీరోయిన్ ప్రత్యూష ఓ మెరుపు తీగ. చూడడానికి చక్కటి అందంతో పాటు అభినయం, సంప్రదాయ వస్త్రధారణ… కొంటెగా కవ్విస్తూ ఉండే పాత్రలు ఇవన్నీ ఆమెను అనతి కాలంలోనే ఆమెను ప్రేక్షకుల మదిలో నిలిపేశాయి. ప్రత్యూష తెలుగమ్మాయే. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మోహన్‌బాబు హీరోగా వచ్చిన రాయుడు సినిమాలో మోహన్‌బాబు కూతురు పాత్రలో ఆమె నటించింది. ఆ వెంటనే స్టార్స్ సినిమాల్లో నటించింది. దివంగత హీరో ఉదయ్ కిరణ్ కలుసుకోవాలని సినిమాలో గజాలా తర్వాత మరదలి పాత్రలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది.
నాగార్జున – సుమంత్ స్నేహమంటే ఇదేరాలో సుమంత్‌కు జోడీగా చేసిన ప్రత్యూషతో నటించేందుకు అప్పట్లో తెలుగుతో పాటు తమిళ కుర్ర హీరోలు కూడా తహతహలాడేవారు. ముఖ్యంగా సన్నగా, నాజూగ్గా ఉండే ఆమె అందచందాలు బాగా ఆకర్షించేవిగా ఉండేవి. అయితే ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆమెకు ఛాన్సులు వస్తోన్న క్రమంలోనే ఆమె 2002, ఫిబ్రవరి తనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
అయితే ఆమెది అనుమానస్పద మృతి అయినా కూడా ఆమె స్నేహితుడు, ప్రియుడిగా ప్రచారంలో ఉన్న సిద్ధార్థ్ రెడ్డి, అతడి స్నేహితులతో పాటు ఇండస్ట్రీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు ఆమెపై హత్యాచారం చేసి చంపేశారని ప్రత్యూష తల్లి చెపుతూ ఉంటారు. అప్పట్లో ప్రత్యేషను జాయిన్ చేసిన హాస్పటల్లో పక్కనే ఉన్న వారే ఆమెను అక్కడకు తీసుకువచ్చే సరికే ఆమెకు స్పృహ లేదని తనకు చెప్పారని కూడా సరోజనీ దేవి చెప్పింది.
అయితే కొందరు వ్యక్తుల చెప్పిన దాని ప్రకారం ప్రత్యూషను ఐదారు గెస్టు హౌస్‌లకు మార్చి మార్చి నలుగురైదుగురు వ్యక్తులు ఆమెను చరిచారని… నాలుగో గెస్ట్ హౌస్‌కు వచ్చేసరికే ఆమె అపస్మాకర స్థితిలో ఉందని కూడా తనకు తెలిసిందని.. అయితే వాళ్ల పేర్లు మాత్రం తాను చెప్పనని ఆమె తెలిపింది. తన కుమార్తె ఇప్పుడు జీవించే ఉంటే పెళ్లి అయ్యి పిల్లలతో ఫ్యామిలీ జీవితం గడిపేదని.. తన కుమార్తెకు ఆ అదృష్టం లేకపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక సిద్ధార్థ్‌రెడ్డిపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. అతడు మాత్రం ఎంచక్కా పెళ్లి చేసుకుని పిల్లలతో అమెరికాలో ఉంటున్నాడని… ఎవరైనా ఎప్పటకి అయినా చనిపోవాల్సిందే అని.. అయితే తన కుమార్తెకు మంచి జీవితం లేకుండా చేశారని సరోజనీ దేవి బాధపడింది. ఇక ఈ విషయం కోర్టులో ఉండడంతో తాను ఇంతకు మించి ఎక్కువ మాట్లాడవచ్చో కాదో కూడా తనకు తెలియదని ఆమె చెప్పడం బాధాకరం.