బుల్లితెరపై హైపర్ ఆది పేరుకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్ లో స్కిట్స్ వేస్తూ కామెడీకి దూరంగా వల్గారిటీకి దగ్గరగా.. డబుల్ మీనింగ్ పంచెస్ వేస్తూ హైపర్ ఆది గత కొంతకాలంగా జబర్దస్త్ లో నెట్టుకొస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ప్రముఖ ఛానల్స్ నుంచి ఆఫర్ వస్తున్న సరే మల్లెమాలను వీడకుండా హైపర్ ఆది డబుల్ మీనింగ్ పంచెస్ తో దూసుకుపోతున్నాడు .
కొన్ని కొన్ని సార్లు ఈయన వేసే డబుల్ మీనింగ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతుంది. అయినా కానీ తగ్గేదేలే అన్న రీతిలో హైపర్ ఆది దూసుకుపోతూనే ఉన్నాడు . కాగా ఎప్పుడూ అందరిని నవ్విస్తూ చలాకిగా ఉండే హైపర్ ఆది ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు . దానికి కారణం ఆయన ఎదుర్కొంటున్న ప్రాబ్లమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . తన బాడీలో ఓ లోపం ఉన్నట్టు.. ఆ లోపం కారణంగానే ఆయన పెళ్లికి దూరంగా ఉన్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
స్కిట్స్ లో అల్లరి చిల్లరిగా మాట్లాడే హైపర్ ఆది జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ పొజిషన్ కి వచ్చాడన్న సంగతి అందరికీ తెలిసిందే . నవ్వించడానికి ఆయన వల్గర్ పంచెస్ తో పాపులారిటీ దక్కించుకున్నారని.. కానీ రియల్ లైఫ్ లో ఆది మనసు చాలా సున్నితమైనదని చెప్పుకొస్తున్నారు . కాగా ఈ విషయం తెలిసినా కానీ జబర్దస్త్ కమెడియన్స్ ఆయన పెళ్లి పై స్కిట్స్ వేసి..కావాలనే అతనిని టార్గెత్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్నా కానీ జబర్దస్త్ కమెడియన్స్ ఆయనపై పెళ్లి పై స్కిట్స్ వేసి మాట్లాడుకోవడం చాలా దారుణం అంటూ హైపర్ ఆది ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.