Moviesగుండెలపై చేయి వేసుకొని చెప్పండి".. అరవింద్ మాటలకు షాక్ అయిన బాలయ్య..!!

గుండెలపై చేయి వేసుకొని చెప్పండి”.. అరవింద్ మాటలకు షాక్ అయిన బాలయ్య..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం నెపోటిజం. సినీ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్న తమ వాళ్ళ పేర్లను ఉపయోగించుకుంటూ వారసత్వం అంటూ ఇండస్ట్రీలోకి వచ్చే హీరోస్ హీరోయిన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కొందరు మీడియా. ఈ క్రమంలోనే నెపోటిజం అన్న పేరు చాలా హైలెట్గా మారింది . అంతేకాదు గతంలోనూ కాఫీ విత్ కరణ్ షో కి గెస్ట్ గా వెళ్ళిన సమంతకు నెపోటిజంపై ప్రశ్న ఎదురవగానే తప్పుపడుతూ ..స్టార్ హీరో కొడుకు అయినంత మాత్రాన అతను కూడా స్టార్ హీరో అవ్వాలన్న రూల్ లేదుగా అంటూ ఘాటుగా స్పందించింది .

అంతే కాదు విజయ్ దేవరకొండ లాంటి హీరో ఇండస్ట్రీకి అవసరమని ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా రావడమే ఇంపార్టెంట్ అని ..అతని ఓ రేంజ్ లో పొగిడేసింది . అప్పట్లో ఈ వార్తలు సంచలనంగా మారాయి. కాగా రీసెంట్ గా అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన అల్లు అరవింద్ సైతం సీరియస్ కామెంట్స్ చేశారు . హోస్ట్ బాలయ్య నెపోటిజంపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించహ్గ్గా.. అల్లు అరవింద్ మాట్లాడుతూ .. అందరిని ఒకటే మాట అడుగుతున్నాను ..ఎవరైతే నెపోటిజం అంటూ టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారో.. వాళ్ళకి ఈ ప్రశ్న..” మీకు ఇలాంటి అవకాశం వస్తే మీరు వదులుకుంటారా..?

“నా ఫ్రెండ్ లాయర్ ఉన్నారు. వాళ్ళ కొడుకు లాయర్ ..ఇప్పుడు వాళ్ళు మనవడు లాయర్ చేయడానికి రెడీ అయ్యాడు. ఒక ఫ్యామిలీ ఇండస్ట్రీ వాతావరణంలో పెరిగినప్పుడు ..వేరే ఫీల్డ్ లో జాబ్ తెచ్చుకోవాలంటే ఎవరు ఇంట్రెస్ట్ చూయించరు. ఈ క్రమంలోనే కొందరు హీరోస్ తాతలు పేర్లు నాన్నల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు ..అలా వారసత్వం పేరుతో ఇండస్ట్రీలోకి వచ్చిన టాలెంట్ లేకపోతే స్టార్ హీరోగా మారలేరు.. అది అందరికీ తెలిసిందే ..సో ఇలాంటి ట్రోల్లింగ్ చేసి అలాంటి హీరోల పరువు తీయడం మానేస్తే బెటర్” అంటూ ఘాటుగా స్పందించారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news