నటసార్వభౌముడు ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకొన్నా.. సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మ లేని లోటులాగా ఎక్కడో ఏదో మిస్సవుతున్న భావన. ప్రతి సినిమాకుఒక కథ ఉంటుంది. కానీ, ఆ కథ వెనుక ఎన్టీఆర్ అనే ఆరడుగుల ఆజానుబాహుడు కూడా ఉంటాడు. సాధారణంగా ఎన్టీఆర్ తనదగ్గరకు వచ్చే సినిమాలను వద్దనే వారు. కానీ, అది 1981-82 మధ్య కాలం. అంటే.. అన్నగారు రాజకీయాల్లోకి వచ్చే సంధి సమయం.
ఈ సమయంలో అన్నగారు ఫుల్ బిజీగా ఉన్నారు. సహజంగానే అన్నగారు బిజీ అంటే నిర్మాతలు.. దర్శకులు కూడా వెనక్కి వెళ్లిపోతారు. అలానే జరిగింది. కానీ, అన్నగారి తమ్ముడు.. త్రివిక్రమరావు నిర్మాత. ఆ సమయంలో ఆయన ఒక పత్రికలో కీలకమైన ఒక వార్త చదివారు. దీనిని సినిమా తీస్తే ఎలా ?ఉంటుందనే ప్లాన్ చేసుకున్నారు. ఈ సమయంలో దీనిలో అన్న అయితేనే బెటర్ అనుకున్నారు.
కానీ, వెళ్లాలంటే.. భయం.. అడగాలన్నా భయమే. ఎందుకంటే.. తీరికలేని పనుల్లో రాజకీయ వ్యవహారాల్లో అన్నగారు ఫుల్ బిజీగా ఉన్నారు. పార్టీని స్థాపించడమే ధ్యేయంగా.. ఆయన తీరికలేకుండా ఉన్నారు. కానీ.. ఈ సినిమాను అన్నగారితోనే తీయాలనేది త్రివిక్రమరావు ఆలోచన. ఎట్టకేలకు.. పార్టీ పనిమీద మాట్లాడాలంటూ.. ఇంటికి వెళ్లి.. అసలు విషయం చెప్పారు.
ఆయన ఆ మాట చెప్పగానే ముందు ఖస్సుమన్న ఎన్టీఆర్ .. దీని వల్ల రాజకీయంగా కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పడంతో ఓకేచేశారు. ఇలా మన ముందుకు వచ్చి.. దాదాపు ఒక తరాన్ని కుదిపేసిన సినిమానే `జస్టిస్ చౌదరి`. అన్నగారి యాక్షన్ పీక్ లెవిల్లోకి తీసుకువెళ్లిన ఈ సినిమాకు అప్పటి యువ దర్శకుడు రాఘవేంద్రరావు.. మనసు పెట్టి చేశారు.
అంతేకాదు.. రాజకీయంగా ఇది హిట్ కావాలంటూ.. అన్నగారు పదే పదే హెచ్చరించడం.. త్రివిక్రమరావు.. నేతృత్వం.. వెరసి.. ఈ ఆఫర్‌ను వదులుకుందామని అనుకున్న అన్నగారికి.. ఆ సంవత్సరం పార్టీ పెట్టడం.. సినిమా రిలీజ్ కావడం కలిసి వచ్చి.. ఆవెంటనే అధికారంలోకి వచ్చేలా చేసిందనేది సినీ వర్గాలు అప్పట్లో చెప్పుకొన్నమాట.