సినిమా ఇండస్ట్రీలో కావాల్సింది హీరోయిన్‌లో అన్నీ అందాలు తీరం దాటించేలా ఉండటం. తీరం దాటించడం అంటే చల్లారడం. కలల రాణి అభిమానులు ఒక హీరోయిన్‌ను ఫిక్సైయ్యారంటే కలల్లో ఎన్ని అరాచకాలు చేస్తారో మీ ఊహలకే వదిలేయవచ్చు. అందుకే, కమర్షియల్ హీరోకి సినిమాలో ఎంతటి ప్రాముఖ్యం ఉంటుందో హీరోయిన్‌కి అంత ప్రాముఖ్యం ఉంటుంది. హీరో ఫైట్స్ చేస్తే హీరోయిన్ తన అందాలతో జనాలపై దాడి చేసి చమటలు చిందిస్తుంది.
అందుకే, హీరోయిన్ పాత్ర చాలా చిన్నదైనా కూడా మేకర్స్ క్రేజ్ ఉన్న హీరోయిన్‌ను భారీ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకుంటున్నారు. సీనియర్ హీరోయిన్స్ ఇండస్ట్రీకి ఎంత ముఖ్యమో..హీరోకి, దర్శకనిర్మాతలకి కలిసొచ్చే హీరోయిన్ ఎంత ముఖ్యమో అలాగే ఎప్పటికప్పుడు కొత్త మొహాలు ఇండస్ట్రీకి పరిచయం కావడం అంతే ముఖ్యం. అందుకే, కొత్తగా ఒక సినిమా ప్రారంభం అవుతుందంటే కొత్త అమ్మాయి కోసం మేకర్స్ తెగ జల్లెడపడుతుంటారు.
అయితే, ఇండస్ట్రీకి పరిచయమైన ప్రతీ అమ్మాయి స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం లేదు. కెరీర్ ప్రారంభం చాలా ముఖ్యం. వరుసగా సినిమాలు సక్సెస్ అయితేనే ఆ హీరోయిన్‌ను పట్టించుకునేది..అవకాశాలిచ్చి వాడుకునేది. దీనికి కూడా అందరూ పనికిరారు. ఇందుకు ఉదాహరణగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన టక్కరి దొంగ సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్స్‌గా పరిచయమైన బిపాసాబసు, లిసారే. వీరిద్దరూ ఈ సినిమాకి మైనస్ అని రిలీజ్ తర్వాత కామెంట్స్ చేశారు.
ముఖ్యంగా బిపాసాబసు నల్లగా ఉందని ..మరీ బక్కపలచగా అసలు ఒంటిమీద కండ లేదంటూ మాట్లాడుకున్నారు. అంతేకాదు, బిపాసా నవ్వు కూడా మనవాళ్ళకి నచ్చలేదు. కానీ, ఇదే బిపాసాబసు బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. రొమాంటిక్ చిత్రాలతో బాలీవుడ్ మేకర్స్‌ను, ఆడియన్స్‌ను ఒక ఊపు ఊపేసింది. హిందీలో బిపాసా కలర్‌ను ఎవరూ పట్టించుకోలేదు. తన పర్ఫార్మెన్స్‌నే చూశారు. అందుకే తెలుగులో అబ్బే అనుకున్నా హిందీలో మాత్రం మంచి క్రేజ్‌తో కొంతకాలం వెలిగింది.