టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా మిగతా సౌత్ భాషలలో అలాగే బాలీవుడ్‌లోనూ ఒక్కో హీరోయిన్‌ని లైఫ్ ఇచ్చిన దర్శకులెవరో ఒకరున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈమె ఇండస్ట్రీకి ఐరెన్ లెగ్ అనుకున్న హీరోయిన్‌ను స్టార్ హీరోయిన్‌గా తీర్చిదిద్దిన దర్శకులున్నారు. అలాంటి వారిలో సీనియర్ దర్శకులు కె రాఘవేంద్ర రావు, ఏ కోదండ రామిరెడ్డి ఇప్పుడున్న వారిలో పూరి జగన్నాథ్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, హరీష్ శంకర్ లాంటి వారున్నారు.
సీనియర్ నటీమణి రమ్యకృష్ణ కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. దాంతో మిగతావారు ఆమెను ఐరెన్ లెగ్ అంటూ కామెంట్స్ చేసి పక్కన పెట్టారు. ఆ తర్వాత అనూహ్యంగా రాఘవేంద్ర రావు రమ్యకృష్ణకి అవకాశాలిచ్చి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అంతే, మళ్ళీ ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాగే, అప్పట్లో హీరోయిన్‌గా నటించి ఫ్లాప్స్ చూసిన హీరోయిన్స్‌ను ఆదుకొని స్టార్ హీరోయిన్స్‌గా చేసిన వారున్నారు.
పూజా హెగ్డే విషయంలో కూడా ఇదే జరిగింది. తెలుగులో నటించిన మొదటి రెండు సినిమాలు..హిందీలో నటించిన సినిమా ఫ్లాపయింది. కానీ, హరీష్ శంకర్ – దిల్ రాజు పూజాకి బాగా లిఫ్ట్ ఇచ్చారు. ఛార్మీకి కృష్ణవంశీ బాగా సపోర్ట్ చేసి వరుసగా అవకాశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఇలా తమన్నా వెనక కూడా శేఖర్ కమ్ముల ఉన్నారు. తమన్నా నటించిన మొదటి సినిమా శ్రీ. ఈ సినిమా డిజాస్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే.
అయితే, ఇదేదీ పట్టించుకోకుండా శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీడేస్ సినిమాలో మేయిన్ లీడ్‌గా ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆ తర్వాత సంపత్ నంది – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన రచ్చ సినిమాలో అవకాశం దక్కింది. అంతే, మళ్ళీ ఇప్పటివరకూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పుడు గనక శేఖర్ కమ్ముల తమన్నాకి ఛాన్స్ ఇవ్వకపోతే ఈరోజు ఇంత రేంజ్ ఉండేది కాదేమో.
ఇక ఇప్పుడు 35 ఏళ్లు దాటిపోతున్నా పెళ్లి అనే మాట లేకుండా తమన్నా సినిమాలు చేస్తోంది. సీనియర్ హీరోలకు ఆమె మంచి ఆప్షన్‌గా ఉంది. మరి ఈ మిల్కీబ్యూటీ ఇంకా ఏన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో నెగ్గుకు వస్తుందో ? చూడాలి.