జమున. ఓల్డ్ ఆర్టిస్టే అయినా, నేటి ఆమెలాంటి నటి మనకే కాదు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు దొరకలే దు. ఎందుకంటే.. ఆమె అభినయం డిఫరెంట్. కొందరు హీరోయిన్లకు నటించడమే వచ్చు. కానీ, నాటి అగ్రతారగా ఒక దశాబ్దంపాటు వెలిగిపోయిన బ్లాక్ అండ్ వైట్ హీరోయిన్ జమునకు జీవించడమే వచ్చు. ఈ విషయాన్ని సాక్షాత్తూ అక్కినేనినాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం మన మధ్యే ఉన్న జమున.. గురించి అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మూగమనసులు సినిమాలో కొంటెగా, చిలిగా, అదే సమయంలో రౌద్రంగా తనలోని నటనా శక్తిని సంపూర్ణంగా ప్రదర్శించారు జమున. వాస్తవానికి ఈ పాత్రను అప్పటి నటి గీతాంజలిని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఆడిషన్స్ కూడా నిర్వహించారు. కానీ, ఒకే సారి.. కోపం.. ఆ వెంటనే చిలిపితనం.. ఆ మరుక్షణమే శృంగారం వంటి భావభావాలు ప్రదర్శించాల్సిన పాత్ర కావడంతో ఇబ్బంది అయింది.
పైగా గీతాంజలిని చూస్తే.. అప్పటికే ఆమె హీరోయిన్ కన్నా సెకండ్ హీరోయిన్‌గా, కేమిడీ ఆర్టిస్టుగా ప్రేక్షకులతో జేజేలు కొట్టించుకుంటున్నారు. ఆమెను ఇంత సీరియస్ పాత్రకు తీసుకుంటే ప్రజలు రిసీవ్ చేసుకుంటారో లేదో అనే బెంగ వచ్చింది. ఈ నేపథ్యంలోనే జమునను తీసుకున్నారు. అప్పటికే సినిమాల్లో దూసుకుపోతున్న హీరోయిన్‌గా జమునకు పేరుంది.
అయితే, మూగమనసులు చిత్రానికి సెకండ్ హీరోయిన్ పాత్రకన్నాతక్కువ ఇవ్వడాన్ని మొదట్లో అంగీకరించలేదట. కానీ, తర్వాత దర్శకుడు ఫ్యూచర్ ఉంటుందని చెప్పడంతో ఒప్పుకుందట. ఈ సినిమాలో జమున నటన ప్రేక్షకులను కట్టి పడేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానేఅక్కినేని జమున వంటి నటీమణి పుట్టదని కితాబునిచ్చారు. ఇక జమున అన్నా, ఆమె నటన అన్నా ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం అనేవారు.