సినిమా ఇండస్ట్రీ లోకి పెద్ద హీరోయిన్ అవుదామని వచ్చి తమ వ్యక్తిగత కారణాలవల్ల తమకున్న చెడు వ్యసనాల వల్ల సినిమా ఇండస్ట్రీను వదిలేసి దూరంగా బ్రతుకుతున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది ఈ హాట్ బ్యూటీ అంకిత. అంకిత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె ముంబైలో పుట్టి.. అక్కడే పెరిగింది. స్వతహాగా తల్లిదండ్రులు బిజినెస్ కుటుంబం కావడంతో అమ్మడు కూడా బిజినెస్ పై ఇంట్రెస్ట్ చూయించాలని తల్లిదండ్రులు కోరుకున్నారు . అయితే ఆమె ఎవ్వరూ ఊహించిన విధంగా మోడలింగ్ లోకి వచ్చి ఆ తర్వాత చిన్న చిన్న యాడ్స్ ద్వారా జనాలకు పరిచయమైంది . అంకితను జనాలకు పరిచయం చేసింది రస్నా యాడ్.
అంకిత మూడేళ్ల వయసులో రస్నా యాడ్లో నటించి రస్నా బేబీగా పాపులర్ అయింది . ఆ తర్వాత కొంచెం పెద్దయిన తర్వాత అంకిత పలు యాడ్స్ లో నటిస్తూ తన హాట్ అందాలను జనాలకు చూపించింది. ఈ క్రమంలోనే 2002లో వైవిఎస్ చౌదరి తన సినిమాలో హీరోయిన్ కోసం వెతకడానికి ముంబై వెళ్ళినప్పుడు అక్కడ మోడలింగ్ చేస్తున్న అంకిత ఫోటోలు చూశారు. ఒక్కసారిగా ఆయన మైండ్ షాక్ అయిపోయింది. రస్నా యాడ్ చేసిన ఈ పాప నేనా ఈ అంకిత అంత ముద్దుగా ఉన్న పాప ఇంత హాట్ గా తయారైంది అంటూ తన సినిమాలో అవకాశమిచ్చాడు.
ఇలా లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది అంకిత . ఆ తర్వాత ప్రేమలో పావని కళ్యాణ్ సినిమాలో నటించింది .ఈ సినిమా పెద్దగా హిట్టు కాకపోయినప్పటికీ అంకిత లుక్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఆ తర్వాత ఎవరూ ఊహించిన విధంగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెకక్కిన సింహాద్రి సినిమాలో నటించింది. ఒక్కసారిగా అంకిత పేరు సినీ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. వరుస అవకాశాలు వచ్చాయి . కానీ అంకిత తన హెడ్ వెయిట్ కారణంగా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసింది .
దీంతో సినిమా ఇండస్ట్రీలో అమ్మడు క్రమీన అవకాశాలు తగ్గాయి. అయితే ఈ క్రమంలోనే ఆమె చెడు వ్యసనాలకు బానిసయింది. స్మోకింగ్ చేయడం ..డ్రింకింగ్ చేయడం అలవాటుగా మార్చుకుంది. ముఖ్యంగా నైట్ మూడు పెగ్గులు వేస్తే గాని నిద్ర రాని పొజిషన్ కి చేరుకునేసింది . అంతలా తన డిప్రెషన్ కి లోనైపోయి తన హెల్త్ ని తానే పాడు చేసుకుంది. ఇక అంకితను చూసిన తల్లిదండ్రులు బాధపడిపోయి ఆమెను తమ దగ్గరికి తీసుకెళ్లి రిహాబిటేషన్ సెంటర్లో చేర్పించారట. ఇక తర్వాత ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసారట. ప్రజెంట్ అంకిత సినిమా ఇండస్ట్రీకి దూరంగా బ్రతుకుతుంది.