సినిమా ఇండస్ట్రీకి భాషతో సంబంధం లేదు. కంటెంట్ బాగుంటే ఏ భాషలో ప్రేక్షకులు అయినా ఆరాధిస్తారు. మన తెలుగు త్రిబుల్ ఆర్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు అందరూ ఎంతలా ఆరాధిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే సినీ నటులకు ,కళాకారులకు టాలెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా రాణించవచ్చు. మన దేశంలో స్టార్ హీరో, హీరోయిన్లుగా చెలామణి అవుతోన్న వారిలో మన దేశ పౌరసత్వం లేనివారు.. మన దేశంలో పుట్టని వారు కూడా ఉన్నారు. వాళ్లెవరో చూద్దాం.
అలియా భట్:
బాలీవుడ్ కలల యువరాణి అలియాభట్. తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది. ఆమె ప్రముఖ దర్శకుడు మహేష్‌భట్ కుమార్తె. ఆమె తాజాగా రణబీర్ కపూర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె లండన్‌లో పుట్టి పెరిగింది. ఆమె తల్లి సోనీ రజ్దాన్ బ్రిటీష్ నటి. లండన్‌లో పుట్టి పెరిగిన అలియా బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉంది.
కత్రినాకైఫ్ :
ఇండియాలోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటోన్న ఈ నటి తాజాగా విక్కీ కౌశల్‌ను పెళ్లాడింది. వయస్సులో కత్రినా కంటే కౌశల్ చిన్నోడే. ఆమె కూడా బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉంది. కత్రినా హంకాంగ్‌లో పుట్టి పెరిగింది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్:
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల కేసుల్లో చిక్కుకోవడంతో ఆమె పేరు బాగా వినిపిస్తోంది. ప్రభాస్ సాహో సినిమాలో స్పెషల్ సాంగ్‌తో దేశాన్నే ఓ ఊపు ఊపేసింది. తాజాగా కిచ్చ సుదీప్‌తో విక్రాంత్ రోణ సినిమాలో నటించింది. ఈ ముద్దుగుమ్మది శ్రీలంక. సల్మాన్‌ఖాన్ ఆమెను బాలీవుడ్‌లోకి తీసుకువచ్చి ప్రోత్సహించాడు.
నర్గీస్ ఫక్రీ :
రణబీర్ కపూర్ నటించిన రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన నర్గీస్ న్యూయార్క్‌లో పుట్టి పెరిగింది. ఆమెది అమెరికా పౌరసత్వం.
అక్షయ్ కుమార్:
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పుట్టి పెరిగినా అక్షయ్ కెనడా పాస్‌పోర్ట్ కోసం భారత పౌరసత్వం వదలుకున్నాడు.
మనీషా కోయిరాలా :
20 ఏళ్ల క్రితం తన అంద చందాలతో మనీషా దేశాన్ని ఊపేసింది. ఆమె ఇండియన్ కాదు. నేపాల్ మహారాజుల వంశంలో పుట్టింది.