Moviesఆయన నన్ను పచ్చి బూతులు తిట్టారు.. పేరుతో సహా బయటపెట్టేసిన చిరంజీవి..!!

ఆయన నన్ను పచ్చి బూతులు తిట్టారు.. పేరుతో సహా బయటపెట్టేసిన చిరంజీవి..!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. నయనతార, సత్యదేవ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గాడ్ ఫాదర్. టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ రాజా ..ఈ సినిమాను తెరకెక్కించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది . మొదట ఆటకే సినిమా రిజల్ట్ చెప్పేసిన మెగా అభిమానులు.. ఆ తర్వాత ఈ సినిమాని సూపర్ హిట్ గా నిలబెట్టారు . మొదటిరోజు గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లతో సినీ ఇండస్ట్రీ షేక్ అయిపోయింది .

కాగా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో శనివారం గాడ్ ఫాదర్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు గాడ్ ఫాదర్ టీం. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన అందరూ అటెండ్ అయ్యి సినిమా ఇంతటి సక్సెస్ చేసిన జనాలకు కృతజ్ఞతలు తెలుపుకొచ్చారు. కాగా ఈ స్టేజ్ పై చిరంజీవి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు . దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో టాప్ ట్రైనింగ్ లో దూసుకుపోతుంది.

మనకు తెలిసిందే గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ . నిజానికి ఈ సినిమాలో ఈ పాత్ర కోసం మొదటగా అనుకున్న హీరో వరుణ్ తేజ్ నట. అయితే మోహన్ రాజా మాత్రం ఈ పాత్ర కోసం ఏ మెగా హీరోని పెట్టడానికి ఇష్టపడలేదట . కేవలం బాలీవుడ్ నటులైతే క్రేజ్ తో పాటు సినిమాకి మరింత హైప్ వస్తుందన్న ఉద్దేశంతోనే బాలీవుడ్ హీరోలను పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించాడట . ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన సల్మాన్ ని ఈ పాత్ర కు చూస్ చేశాడు. అఫ్ కోర్స్ సినిమా రిలీజ్ అయ్యాక సల్మాన్ ఖాన్ రోల్ పెద్దగా జనాలకు నచ్చలేదు.

అయితే ఈ సినిమా కోసం ఫ్యాన్సీ రేటును సల్మాన్ ఖాన్ కు ఇవ్వబోతూ ఉంటే వాళ్ల మేనేజర్ అరిచాడట. అంతేకాదు సల్మాన్ కూడా ఈ విషయంలో ఆయనపై ఫైర్ అయ్యాడట. బూతులు తిడుతూ మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని డబ్బులు తో చూస్తావా అంటూ నోటికొచ్చినట్లు తిట్టాడని ..ఆ తిట్లు కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చాయని చిరంజీవి చెప్పుకొచ్చాడు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news