Moviesఅమ్మ బాబోయ్..సినిమా ల కోసం ఆఖరికి ఆ పని కూడా చేసేసిన...

అమ్మ బాబోయ్..సినిమా ల కోసం ఆఖరికి ఆ పని కూడా చేసేసిన తమన్నా..వీడియో వైరల్..!!

సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావడం పెద్ద మ్యాటర్ కాదు. వచ్చిన తర్వాత ఆ పేరుని అలాగే ఉంచుకోవడం.. ఆ క్రేజ్ ని ఆ పాపులారిటీని తగ్గించుకోకుండా మెయిన్ టైన్ చేయడమే అసలు మ్యాటర్. అయితే అలా చాలా తక్కువ మంది హీరోయిన్స్ మాత్రమే ఇలా చేయగలరు. నిజానికి అలా క్రేజ్ పాపులారిటీ దక్కించుకోవడానికి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూనే ఉండాలి. ఏదో ఒక విషయం కారణంగా ఆ హీరోయిన్ పేరు మీడియాలో వినిపిస్తూ ఉంటే కచ్చితంగా హీరోయిన్ పాపులారిటీ పది కాలాలపాటు చల్లగా ఉంటుంది.

పాపం ఈ విషయం లేటుగా తెలుసుకున్నట్లు ఉంది తమన్నా అందుకే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పాపులారిటీ మొత్తం పోయాక పాపులారిటీని దక్కించుకోవడానికి నానా తంటాలు పడుతుంది. ప్రజెంట్ తమన్న కెరియర్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . మూడు ఫ్లాపులు ఆరు ట్రోలింగ్ అన్న విధంగా తమన్న గ్రాఫ్ ఉంది . రీసెంట్ గా ఆమె నటించిన బబ్లీ బాన్సర్ సినిమా అట్టర్ ఫ్లాప్ ను సొంతం చేసుకుంది. దీంతో తమన్నా కెరీర్ దాదాపు క్లోజ్ అయిపోయినట్టే అనుకున్నారు.

అయితే తమన్నా మాత్రం తన కెరియర్ మళ్ళీ స్పీడ్ అప్ చేయడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తుంది. ఈ క్రమం లోనే తమన్నా గార్బా డాన్స్ వేసి సోషల్ మీడియాలో టాప్ ట్రైనింగ్ లోకి వచ్చింది . మనకు తెలిసిన దేవీ నవరాత్రులు గార్బా డ్యాన్స్ ఎంత ప్రత్యేకమో ఎలాంటి వారైనా సరే గార్బా డాన్స్ వేస్తూ ఆనందం పొందాల్సిందే. ఈ ఆనందం సెలబ్రిటీలకు అతీతం కాదు అంటూ తమన్న చిన్న పెద్ద తో కలిసి డాన్స్ వేసింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న మిల్కీ బ్యూటీ తమన్న అభిమానులతో కలిసి గార్బా డ్యాన్స్ చేసింది. దీంతో అక్కడ తమన్నా హంగామా అంతా ఇంతా కాదు ఈ గార్బా డాన్స్ కారణంగా పడిపోయిన తమన్న ఇమేజ్ ని మళ్ళీ పైకి అందుకునే విధంగా చేసింది అంటున్నారు జనాలు . మరి చూడాలి గార్బ డ్యాన్స్ తో ఏ మాత్రం తన సినిమా అవకాశాలను రప్పించుకుంటుందో తమన్నా..?

 

Latest news