Moviesప్రభాస్ ని తొక్కేస్తున్న ఆ స్టార్ హీరో..బ్యాక్ గ్రౌండ్ లో ఇలాంటి...

ప్రభాస్ ని తొక్కేస్తున్న ఆ స్టార్ హీరో..బ్యాక్ గ్రౌండ్ లో ఇలాంటి పనులా..ఛీ.ఛీ..?

జనరల్ గా మనం ఎదుగుతూ ఉంటే పక్క వారు చూడలేరు. శభాష్ అంటూ పొగిడే చేతులు కన్నా బాధపడుతున్నప్పుడు నవ్వే నోరులే ఎక్కువ వస్తాయి . ఇది సమాజంలో అందరూ చేసే తప్పే . ఈ మధ్యకాలంలో ఎవరైనా పడిపోతే ఆదుకోవడానికి చేతులు ఇచ్చే మనుషులు రావట్లేదు ..సెల్ఫీలు తీసుకుని స్టేటస్లు పెట్టుకునే జనాలే కనిపిస్తున్నారు. అంతలా పాపులారిటీ కోసం పాకులాడుతున్నారు జనాలు . ఈ లిస్టులో స్టార్ సెలబ్రెటీస్ కూడా ఉన్నారు. ఎవరైనా హీరో హిట్ కొడితే ఏడ్చే జనాలు,, ఫ్లాప్ అంటూ ట్రోల్ చేస్తే నవ్వుకునే హీరోస్ సినీ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు . మరీ ముఖ్యంగా ఇలాంటి హీరోలు బాలీవుడ్ లో బోలేడు మంది ఉన్నట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్గా రిలీజ్ అయిన ఆదిపురుష్ టీజర్ పై ఎలాంటి ట్రోలింగ్ జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పాపం బాహుబలి తో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో.. ఆ తర్వాత తను చేసే సినిమాలు ద్వారా తన పేరుని మరింత డీగ్రేట్ చేసుకుంటున్నాడు ప్రభాస్. దీంట్లో ప్రభాస్ తప్పు ఏమాత్రం లేదు. నమ్మి కథను నిజాయితీగా నటించి అభిమానులను మెప్పించాలనుకుంటున్నాడు. కానీ కొందరు డైరెక్టర్స్ సినిమాకు సంబంధించిన వారు ఆయనను మోసం వల్లే ఇలా జరిగింది.

అంతేకాదు మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాక ప్రభాస్ పరువు మరింతగా పోతుంది అన్న కామెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి . వాటిల్లో నిజం లేకపోనూ లేదు . టాలీవుడ్ లో ఉన్నంతవరకు ప్రభాస్ ఓ రేంజ్ లో వెలిగాడు. ఏ ముహూర్తాన బాలీవుడ్ లో అడుగు పెట్టాడో అప్పటినుంచి అన్ని ఫ్లాప్లే అయితే రీసెంట్గా ఆది పురుష్ టీజర్ ట్రోలర్స్ వెనక ఓ బాలీవుడ్ బడా హీరో హస్తం ఉన్నట్లు వినిపిస్తుంది. ఆయన స్టార్ హీరో పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చాడు.

ప్రభాస్ బాలీవుడ్లోకి అడుగుపెట్టాక ఆయన క్రేజ్ తగ్గిపోయింది. సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇక ఎక్కడ సినిమా అవకాశాలు రావో అన్న కారణంగా ట్రోలర్స్ ని మరింత రెచ్చగొడుతూ బ్యాక్ గ్రౌండ్లో టీం ఏర్పాటు చేసుకొని.. మరీ తన పేరు బయటికి రాకుండా ప్రభాస్ ను డిగ్రేడ్ చేయడానికి కుట్ర పన్నుతున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. దీంతో ప్రభాస్ ని జాగ్రత్తగా ఉండమంటూ హెచ్చరిస్తున్నారు అభిమానులు.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news