టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సమంత ఆ తర్వాత కొన్ని కారణాల చేత భర్తకు దూరంగా ఉండింది . అంతేకాదు విడాకులు ఇచ్చేసి నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అంటూ సింగిల్ గా జాలిగా ఎంజాయ్ చేస్తుంది. కాగా విడాకుల తర్వాత సమంత సినీ కెరియర్ పడిపోతుందని.. సమంత ఇక సినిమాలు చేయదని అంతా భావించారు.
కానీ ఎవరు ఊహించని విధంగా బౌన్స్ బ్యాక్ అవుతూ సమంత క్రేజీ క్రేజీ రోల్స్ పట్టేస్తూ స్టార్ హీరోయిన్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్గా ఎదిగిపోయింది . మరీ ముఖ్యంగా పుష్ప సినిమాల్లో ఊ అంటావా మామ అంటూ హాట్ పెర్ఫార్మన్స్ ఇస్తూ కెరియర్ లోనే ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేయడం సంచలనంగా మారింది. కాగా రీసెంట్గా ఆమె నటించిన యశోద సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.
నవంబర్ 11న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. కాగా ఇన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత త్వరలోనే సినీ ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ ప్రమోషన్స్ లో అక్కినేని ఫ్యామిలీ నుండి ఆమె ఎందుకు దూరంగా వచ్చేసిందో ప్రతి విషయాన్ని క్లియర్గా ఆమె అభిమానులకు అలాగే.. ఆమెపై ట్రోల్ చేసే జనాలకు చెప్పడానికి సిద్ధంగా ఉందట . అందుకే దానికి సంబంధించిన బ్యాగ్రౌండ్ పనులను పూర్తి చేసుకుంటుంది సమంత అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు దివాళి తర్వాత నుంచి సమంత తన కొత్త లైఫ్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. కేవలం సినీ ఇండస్ట్రీ.. తన బిజినెస్ లైఫ్ పైన కాన్సన్ట్రేషన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి సమంత కొత్త లైఫ్ ఎలా ఉండబోతుందో..?