సినీ ఇండస్ట్రీలో ఉండే బడా ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ ఫ్యామిలీ దగ్గుబాటి డాక్టర్ డి.రామానాయుడు. అలాంటి ఓ చెరగని ముద్ర దగ్గుబాటి ఫ్యామిలీకి సంపాదించి పెట్టారు. మనకు తెలిసిందే రామానాయుడు వారసత్వాని అందిపుచ్చుకొని సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా వెంకటేష్ హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇద్దరు తమదైన స్టైల్ లో రాణిస్తూ దగ్గుబాటి ఫ్యామిలీని సినీ ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక ఆ తర్వాత సురేష్ బాబు కొడుకుగా రానా దగ్గుబాటి సినీ ఇండస్ట్రీలోకి లీడర్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న రానా తర్వాత సినిమాల నుంచి ఫ్లాప్స్ అందుకున్నారు.
రీజన్ ఏంటో తెలియదు కానీ వరుసగా రానా కు అన్ని ఫ్లాప్ సినిమాలే పడ్డాయి. దీంతో రానా ఎవరు ఊహించిన విధంగా విలన్ రోల్స్ సెలెక్ట్ చేసుకుని జనాలను మెప్పించాడు. నిజం చెప్పాలంటే హీరోగా రానా చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయే.. కానీ రానా విలన్ గా చేసిన సినిమాలు ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. అంతెందుకు ఆ మధ్య వచ్చిన బాహుబలి నిన్న వచ్చిన భీంలా నాయక్ రెండు సినిమాలు హిట్ అవ్వడానికి విలన్ పాత్రలో పోషించిన రానా ప్లస్ పాయింట్ అయ్యాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే . ప్రజెంట్ రానా పలు వెబ్ సిరీస్ లో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
మనకు తెలిసిందే రానా దగ్గుబాటి , టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మంచి ఫ్రెండ్స్. ఆ తర్వాత వాళ్ళు రిలేషన్షిప్ కంటిన్యూ అయింది. అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల సమంత నాగచైతన్య విడిపోయారు .దీంతో అప్పుడే దగ్గుబాటి ఫ్యామిలీ ఓ రూల్ పెట్టుకునిందట . మన ఫ్యామిలీలో ఎవరు సమంతతో మాట్లాడకూడదని ..ఆమెను మీట్ అవ్వకూడదని ఓ కండిషన్ పెట్టుకున్నారట. నాగచైతన్యను బాధపెట్టిన ఆవిడతో మనకి ఏ సంబంధం లేదు అంటూ ఆమెతో ఎవరు మాట్లాడొద్దు.. ఆమెను కలవదు అంటూ అందరికీ ఒక కండిషన్ పెట్టారట వెంకటేష్ .
అయితే రానా దగ్గుబాటి మాత్రం ఆ కండీషన్ ని బ్రేక్ చేస్తూ సమంత తో మాట్లాడారట. సమంత హెల్త్ బాగోలేదు అని వరుసగా వార్తలు వినిపిస్తున్న క్రమంలో సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడంతో నిజంగానే తనకి హెల్త్ బాగోలేదా అంటూ రానా ఆమెకు ఫోన్ చేసి పలకరించాడట . అందుతున్న సమాచారం ప్రకారం ఆమె అమెరికాలో ఉంది. దీంతో సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఫేక్ అంటూ ఆనందపడినా,,ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ మాత్రం రానా పై బాగా ఫైర్ అయ్యాడట.