దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కెరీర్‌లో ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడ చూడలేదనే విషయం అందరికీ తెలిసిందే. స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ వరకూ సినిమా సినిమాకి ఆయన రేంజ్ అమాంతం పెరుగుతూనే ఉంది. టాలీవుడ్‌లో మొదటి పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి. బాహుబలి సిరీస్ ఆయన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి అంటే ఇండియన్ సినిమాను హాలీవుడ్ రేంజ్‌కి తీసుకువెళ్ళే దర్శకుడు ఆయనే అని చెప్పుకున్నారు.
సినిమా కథ, కథనం, మేకింగ్ విషయంలో ఎలా అయితే కాంప్రమైజ్ కారో అలా ఆర్టిస్టుల సెలక్షన్ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా తను అనుకున్న పాత్రకు ఎవరైతే సూటవుతారో వారినే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పటి వరకు ఒక హీరోతో ఈ కథ చేయాలి అంటే దాదాపు అదే హీరోతో చేస్తూ వచ్చారు. ఒక్క సింహాద్రి సినిమా విషయంలో మాత్రం ఆయన ఆలోచన మారింది. అయితే, నందమూరి హీరోతోనే ఈ సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.
ఇక రాజమౌళి సినిమాలో హీరో పాత్ర ఎంత బలంగా ఉంటుందో హీరోయిన్ పాత్ర కూడా అంతే బలంగా ఉంటుంది. కథలో హీరోయిన్‌ది కూడా కీలక పాత్ర ఉండేలా ముందే కథ, కథనం సిద్ధం చేసుకుంటారు. అలా ఆయన సినిమాలలో నటించిన హీరోయిన్స్‌కి మంచి క్రేజ్ అండ్ పాపులారిటీ దక్కింది. విక్రమార్కుడు సినిమాలో నటించిన అనుష్క శెట్టిని ఎంత గ్లామర్‌గా చూపించారో అందరికీ తెలిసిందే. అలాగే, బాహుబలి సిరీస్ సినిమాలలోనూ..!
ఇదే అనుష్క శెట్టి రాజమౌళి తీసిన గత పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్‌లోనూ నటించాల్సిందట. ఇందులో రాం చరణ్ భార్య పాత్రలో అనుష్కనే తీసుకోవాలనుకున్నారట. కానీ, గత కొంతకాలంగా అనుష్క ఫాం కోల్పోవడం అలాగే, బాగా లావవడం మైనస్ అయింది. ఇక దాంతో చరణ్ పక్కన అంటే అసలు సూటవదని రాజమౌళి వద్దనుకున్నారట.
అంతేకాదు, అనుష్కకి బాలీవుడ్‌లో ఏమాత్రం క్రేజ్ లేదు. అందుకే, అక్కడ పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్ఠిలో పెట్టుకుని ఆలియా భట్‌ను సెలెక్ట్ చేసుకున్నారని తెలుస్తుంది. లేదంటే మరోసారి రాజమౌళి దర్శకత్వంలో అనుష్క శెట్టి నటించి ఉండేది.