MoviesNBK107 టైటిల్‌పై బాల‌య్య మామూలు స్కెచ్ వేయ‌లేదుగా...!

NBK107 టైటిల్‌పై బాల‌య్య మామూలు స్కెచ్ వేయ‌లేదుగా…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అఖండ త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా ఎన్బీకే 107. మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తుండ‌గా శృతీహాస‌న్ హీరోయిన్‌గా చేస్తోంది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుండ‌గా… క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా 2023 జ‌న‌వ‌రిలో రిలీజ్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన స్టిల్స్ సినిమాపై అంచ‌నాలు అయితే పెంచేస్తున్నాయి. మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌తో క్రాక్ లాంటి సూప‌ర్ హిట్ సినిమా తెర‌కెక్కించిన మ‌లినేని గోపీ ఇప్పుడు బాల‌య్య‌తోనూ ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ సినిమా తెర‌కెక్కిస్తుండ‌డంతో స‌హ‌జంగానే ట్రేడ్ వ‌ర్గాల్లోనూ, సినిమా వ‌ర్గాల్లోనూ ఈ క్రేజీ కాంబోపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్‌పై చిన్న అప్‌డేట్ కూడా రాలేదు. టైటిల్ ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారా ? అని బాల‌య్య అభిమానులు కూడా ఎంతో ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో బాల‌య్య అన్‌స్టాప‌బుల్ సెకండ్ సీజ‌న్ టీజ‌ర్ లాంచ్‌లోనే ఈ టైటిల్ ఎనౌన్స్ చేస్తార‌న్న టాక్ వ‌చ్చింది. అయితే అది జ‌ర‌గ‌లేదు.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం బాల‌య్య ఈ క్రేజీ ప్రాజెక్టు టైటిల్ ఎనౌన్స్‌మెంట్ కోసం ప్ర‌త్యేక ముహూర్తం పెట్టుకున్నార‌ని.. టైటిల్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తార‌ని తెలిసింది. ఏదేమైనా టైటిల్‌తోనే అంచ‌నాలు దుమ్ము రేగిపోవాల‌ని బాల‌య్య టార్గెట్‌గా పెట్టుకున్నారు. మ‌రి టైటిల్ సినిమాపై హైప్ ఏ రేంజ్‌కు తీసుకు వెళుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news