మనిషి ఆశాజీవి దొరికిన దాంతో సంతృప్తి పడరు.. ఇంకా ఏదో కావాలి ..ఇంకా ఏదో చేయాలి.. ఇంకా ఏదో అనుభవించాలి అనుకునే మైండ్ సెట్ కలవారు. ఇంకా అన్న పదాన్ని ఇంకా ఇంకా కొనసాగిస్తే.. ఏదీ కాకుండా ఎటూ కాకుండా అయిపోతారని ప్రూవ్ చేశాడు నాగచైతన్య . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య మొదటి సినిమాతో పర్లేదు అనిపించుకున్నాడు .
ఇక తర్వాత నుంచి హిట్లు ఫ్లాప్ ల తో సంబంధం లేకుండా.. తన స్టైల్ సినిమాలు చేసుకుంటూ పోయాడు .అయితే ఇప్పటివరకు నాగచైతన్య నటించిన ఒక్క సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అవ్వలేదు. దీంతో నాగచైతన్య హీరో గానే మిగిలిపోయాడు .కానీ టాలీవుడ్ స్టార్ హీరోగా మారలేదు . అయితే ఇక్కడే చించలేని ఆయన బాలీవుడ్ లో చించేద్దామని లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు .
ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేశాడు. సీన్ కట్ చేస్తే సినిమా డిపాజిట్లు కూడా రాకుండా గల్లంతయింది. పరమ చెత్త టాక్ సంపాదించుకుంది. దీంతో ఒక్కసారి నాగచైతన్య ఉన్న పరువు కాస్త పోయింది. ఇక అదే లిస్టులో కి యాడ్ అయ్యాడు టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే , హీరో కాదు విలన్ కాదు ఎలాంటి రోల్స్ నైనా సరే అవలీలగా నటించే సత్తా ఉన్న నటుడు .
అయితే సత్యదేవ్ కూడా నాగచైతన్య లాగా అదే తప్పు చేశాడు . తెలుగులో వచ్చిన పాపులారిటీ తో కోలీవుడ్ లో ఉన్న పబ్లిసిటీ చాలదు అన్నట్టు బాలీవుడ్ పై కన్నేసాడు . ఈ క్రమంలోనేఅక్షయ్ కుమార్ నటించిన రామసేతు సినిమాలో కీలకపాత్రలో కనిపించాడు. ఈ సినిమాపై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసాడు సత్యదేవ్. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకోవడం ఖాయం అంటూ భావించాడు. సీన్ కట్ చేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . గాడ్ ఫాదర్ తో సత్యదేవకు వచ్చిన పేరు రామసేతు సినిమాతో సంక నాకి పోయింది . దీంతో సత్యదేవ్ బాలీవుడ్ ఆశలు తారుమారు తయ్యాయి . ఇలా ఉన్నదాంతో సరి పెట్టుకోకుండా అత్యాశ అని ఇంకా అంటూ బాలీవుడ్ పై మోజు పడి మన తెలుగు హీరోలు అటు ఇటు ఎటు కాకుండా అయిపోతున్నారు.