సాధారణంగా.. అన్నగారు ఎన్టీఆర్ అనారోగ్యం భారిన పడిన సందర్భాలు చాలా వరకు తక్కువగా ఉన్నా యి. ఆయన పెద్దగా అనారోగ్యంకు గురవ్వలేదు. ఆరోగ్యం విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఆయన ఎప్పుడూ.. ఆసుపత్రికి కూడా వెళ్లిన సందర్భం కూడా లేదు. అయితే..పరమానందయ్య శిష్యులకథ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అన్నగారు ఒకింత అస్వస్థతకు గురయ్యారు. అది విజయ స్టూడియోలో షూటింగు జరుగుతున్న సమయం. ఆ షెడ్యూల్‌లో మెగా నటులు నాగయ్య వంటివారు కూడా ఉన్నారు.
అయితే.. అనూహ్యంగా అన్నగారు అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో షూటింగు స్పాట్‌లో ఉన్న అల్లు రామలింగయ్య.. వైద్యం చేయగలరని.. నాగయ్యకు ఒక్కరికే తెలుసు. ఆయన హోమియోపతి వైద్యంలో దిట్ట. అయితే.. చాలా మందికి తెలియదు. దీంతో అన్నగారిని ఆసుపత్రికి తరలించాలా? వద్దా.. అనే మీమాంస ఏర్పడింది. ఆసుపత్రికి తరలిస్తే.. షూటింగ్ ఆగిపోతుంది. మళ్లీ ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. దీంతో నాగయ్య సలహా కోరారు.
ఈ క్రమంలో ఆయన సూచనల మేరకు అల్లు రామలింగయ్య.. అన్నగారి నాడి చూసి.. వైద్యం అందించా రు. కేవలం 5 నిముషాలలోనే అన్నగారు తిరిగి కోలుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత.. అన్నగారు ఎంతో సంబరపడిపోయారు. తాను అల్లోపతి వైద్య మందులు తీసుకోనని.. అయితే.. తనకు అల్లు రామలింగయ్య.. హోమియో వైద్యం అందించి.. ఎంతో ఉపకారం చేశారని.. ప్రశంసించారట. తర్వాత కాలంలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా.. అల్లు వైద్యం, సలహాలు తీసుకునేవారట అన్నగారు.
ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్‌కు, అల్లు రామలింగయ్యకు మధ్య అనుబంధం మరింత స్ట్రాంగ్ అయ్యింది. అల్లు రామలింగయ్య నేరుగానే ఎన్టీఆర్ ఇంట్లో వంట గదిలోకి వెళ్లి వంట చేస్తోన్న బసవతారకంతో ఏమ్మా ఈ వంటలు అన్నీ మా బండోడికేనా ? అని సరదాగా ఆటపట్టించేవారట. అంత క్లోజ్‌నెస్ వీరిద్దరి మధ్య ఏర్పడింది.