సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటర్ అవ్వాలన్న.. వచ్చిన తర్వాత ఆ పేరు పది కాలాలపాటు అలాగే ఉండాలన్న.. దానికి బోలెడంత అదృష్టం ఉండాలి. అదృష్టం తో పాటు అందం టాలెంట్ అంతో ఇంతో ఉండాలి. అప్పుడే ఆ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా నెట్టుకు రాగలరు. ఏదో కొంచెం అదృష్టం ద్వారా ఒక సినిమా హిట్ అయినా..ఆ సినిమా వల్ల వచ్చిన క్రేజ్ ను ఆమె హెడ్ వెయిట్ గా మార్చుకుంటే మాత్రం అంతే సంగతులు సినీ కెరియర్ మొత్తం సర్వం నాశనం అవ్వాల్సిందే. ప్రజెంట్ అదే కోవాలోకి వస్తుంది ఈ డీజే టిల్లు రాధిక ..అదేనండి నేహా శెట్టి.
నేహా శెట్టికి మంచి టాలెంట్ ఉంది. కానీ నిరూపించుకోవడానికి సరైన కథ రావడం లేదు. వచ్చిన కథలు ఈమెకు నచ్చడం లేదు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఒకే ఒక్క హిట్ అందుకొని సినీ ఇండస్ట్రీకి దూరంగా బ్రతుకుతుంది ఈ అందాల అమ్మడు . తెలుగులో ఆ మధ్య వచ్చిన డీజే టిల్లు సినిమాలో హీరోయిన్గా నటించిన మంగళూరు యంగ్ బ్యూటీ నే ఈ నేహా శెట్టి. హీరో సిద్దు జొన్నలగడ్డ ను ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువుల బావినీర్లు తాపించాలనుకుని లాస్ట్ కు అమ్మడునే అడ్డంగా బుక్కైపోయినా రాధిక పాత్రలో అదరగొట్టింది. అయితే ఈ చిత్రం ఇచ్చిన సక్సెస్ తో నేహా శెట్టికి హెడ్ వెయిట్ పెరిగిందని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. రాధిక పాత్రలో తన అద్భుతమైన నటన తీరుతో కనబరిచిన నేహా శెట్టి.. ఆ తర్వాత తన వద్దకు వచ్చిన మంచి మంచి సినిమాలను కేవలం రెమ్యూనరేషన్ తక్కువ అనే పేరుతో రిజెక్ట్ చేసింది .
దీంతో అమ్మడుకు అవకాశాలు ఇవ్వడమే మానేశారు. ఈ క్రమంలోనే నేహా సినీ కెరియర్ క్లోజ్ అయిపోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో నేహా శెట్టి తాను రెమ్యూనరేషన్ తగ్గించుకుంటానని సినిమాలో అవకాశం ఇవ్వండి అంటూ తనకి ఇది వరకు కాల్ చేసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్లకి కాల్ బ్యాక్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తుందట. అంతేకాదు సోషల్ మీడియాలో ఓవైపు అందాల ఆరబోస్తూనే మరోవైపు ఎలాంటి పాత్రలకైనా సిద్ధం అంటూ ఓపెన్ గానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట .
ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ అమ్మడుకు రేచీకటి ఉన్న పాత్రను ఫైనల్ చేశారట. దీంతో ఎలాగైనా ఈ సినిమా ద్వారా మరింత హిట్ కొట్టాలని తన పేరును పాపులర్ చేసుకోవాలని నేహా శెట్టి రాత్రులు కూడా నిద్రపోకుండా రేచీకటికి సంబంధించిన సినిమాలను దానికి సంబంధించిన బుక్స్ ను చదివి రియల్ గా రేచీకటి ఉంటే ఓ అమ్మాయి ఎలా ఫేస్ చేస్తుంది . ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయంగా నైట్ అవుట్ లు చేస్తూ రేచీకటి ఉంటే ఎలా ఉండాలనే దానిపై ప్రాక్టీస్ చేస్తుందట . దీంతో కొందరు వచ్చిన అవకాశాలు వదులుకోవడం ఎందుకు.. ఇప్పుడు అర్ధరాత్రి నిద్ర మేలుకొని ప్రాక్టీస్ చేయడం ఎందుకు? అందుకే కధల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అంటూ జనాలు చెప్పుకున్నారు.