బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కత్రినా కైఫ్ గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం కాస్త జోరు తగ్గింది. కత్రినా కెరీర్ ప్రారంభంలో అసలు హీరోయిన్ మెటీరియల్ కాదనే కామెంట్స్ అటు బాలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లోనూ వినిపించింది. అంతేకాదు కత్రినాకి ఉన్న హైట్‌కి డాన్స్ చేయగలదా..? అని నవ్వుకున్నవారూ ఉన్నారు. కానీ, కత్రీనా అవన్నీ ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకుంది.
యాక్టింగ్‌లోనూ డాన్స్‌లోనూ మంచి పర్ఫార్మర్ అని ప్రూవ్ చేసుకుంది. హిందీలో కామెంట్స్ చేసిన వారే చప్పట్లు కొట్టారు. హైట్ ప్రాబ్లం అయినా కూడా ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ హీరో కత్రినాకి తన సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు. ఇక చకినీ చమేలీ అంటూ మాస్ ఆడియన్స్‌లో మంటరేపింది. ఐటెం సాంగ్ అంటే ఇలా ఉండాలి అనేట్టుగా తన మాసీవ్ పర్ఫార్మెన్స్‌తో ప్రూవ్ చేసుకుంది. హిందీలో కత్రీనా హీరోయిన్‌గా నటించినా, ఐటెం సాంగ్స్ చేసినా తన మార్క్ చూపించింది.
దాదాపు బాలీవుడ్‌లో అందరు హీరోలతోనూ నటించింది. ఒకదశలో కత్రినా డేట్స్ దొరకాలంటే నిర్మాతలు నెలలకి నెలలు ఎదురుచూశారు. ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇదే కత్రీనా మొదటి తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్‌లో డి సురేష్ బాబు నిర్మించారు. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మల్లీశ్వరి సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యింది.
అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అల్లరి పిడుగు సినిమాలో కూడా కత్రినా హీరోయిన్‌గా నటించింది. వీటిలో మల్లీశ్వరి సూపర్ హిట్. అయితే మల్లీశ్వరి సినిమాకి సురేష్ బాబు కత్రీనా కైఫ్‌కి అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ విషయంలో రామానాయుడు, వెంకటేష్ ..సురేష్ బాబుతో వాదించారట. ఒక్క సినిమాకే కోటి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశించారట.
సురేష్ బాబు మాత్రం తను బాలీవుడ్ నుంచి వచ్చిందనే కారణంతో అంత రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాధానమిచ్చారట. ఏదేమైనా 5 నుంచి 10 లక్షలిస్తే కొత్త అమ్మాయి ఎవరైనా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలాంటప్పుడు కత్రినాకి కోటి ఎందుకిచ్చినట్టు అని ఫైర్ అయ్యారట. అలా కత్రినా వల్ల సురేష్ బాబుకి వెంకటేష్ కి మధ్య చిన్న వాదన జరిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది.